కరోనా వైరస్ : చైనాకి అత్యవసరంగా కావాల్సినవి ఇవే
ప్రాణాంతక కరోనా వైరస్ చైనాని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా వైరస్ అంతకంతకూ వ్యాపిస్తోంది. రోజు రోజుకి కరోనా వైరస్ మృతుల సంఖ్య

ప్రాణాంతక కరోనా వైరస్ చైనాని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా వైరస్ అంతకంతకూ వ్యాపిస్తోంది. రోజు రోజుకి కరోనా వైరస్ మృతుల సంఖ్య
ప్రాణాంతక కరోనా వైరస్ చైనాని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా వైరస్ అంతకంతకూ వ్యాపిస్తోంది. రోజు రోజుకి కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతోంది. కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. కరోనా వైరస్ తో చైనాలో ఇప్పటివరకు 492మంది చనిపోయారు. హుబెయ్ ఫ్రావిన్స్ లో ఒక్క రోజే 65మంది మృతి చెందారు. చైనాలో 24వేల మంది వైరస్ బారిన పడ్డారు. ఈ మహమ్మారి 25 దేశాలకు విస్తరించింది. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అమెరికాలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఆసియా దేశాల్లో ఏడు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.
కరోనా ధాటికి చైనా వణికిపోతోంది. కాగా, ప్రస్తుతం చైనాకి అత్యవసరంగా కావాల్సినవి వైద్య పరికరాలు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అవి ఉపయోగపడతాయి. వైద్య పరికరాల్లో ముఖ్యంగా N95 మాస్కులు(N95 masks), రక్షణ సూట్స్(protective suits), గాగుల్స్(safety goggles) చైనాకి అత్యవసరంగా కావాలి.
వైద్య పరికరాలు.. సర్జికల్ మాస్కులు, ప్రొటెక్టివ్ సూట్స్, సేఫ్టీ గాగుల్స్.. అత్యవసరంగా కావాలని చైనా ప్రభుత్వం చెప్పింది. వైద్య పరికరాలు లేకపోవడంతో ఆసుపత్రుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయింది. అత్యవసర వైద్య పరికరాలు సరఫరా చేసేందుకు చైనా ప్రభుత్వం అమెరికా సాయం కోరింది. వైద్య పరికరాలు సరఫరా చేసేందుకు సాయం చేస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో.. చైనా వారి హెల్ప్ కోరింది. అలాగే అమెరికాకి చెందిన వైద్య నిపుణులు చైనాకి వచ్చి కరోనా వైరస్ పై అధ్యయనం చేసేందుకు చైనా ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
చైనాలోని ఆసుపత్రుల్లో ముఖ్యంగా కావాల్సింది N95 మాస్కులు. వీటి అవసరం చాలా ఉంది. ఐసోలేషన్ వార్డుల్లో ఎక్కువ రోజుల ఉండే సిబ్బందికి N95 మాస్కులు తప్పనిసరి. వీటిని ధరించడం ద్వారా వైరస్ సోకకుండా రక్షణ కలుగుతుంది. మరోవైపు కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు వుహాన్ లో తక్కువ సమయంలోనే రెండు పెద్ద ఆసుపత్రులు నిర్మించారు. ఇప్పటికే(ఫిబ్రవరి 3,2020) వెయ్యి పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. ఇక ఫిబ్రవరి 5న 1600 పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నారు.
సౌత్ కొరియా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, టర్కీ, పాకిస్తాన్, కజకిస్తాన్, హంగేరీ, ఇరాన్, బెలారస్, ఇండోనేషియా దేశాల ప్రభుత్వాలు.. ఇప్పటికే చైనాకు సాయం చేశాయి. చైనాకి అవసరమైన వైద్య పరికరాలు సరఫరా చేశాయి. సౌత్ కొరియా 10 లక్షల మాస్కులు, లక్ష జతల గాగుల్స్ వుహాన్ నగరానికి సరఫరా చేసింది. ఇక పాకిస్తాన్.. 3 లక్షల మెడికల్ మాస్కులు, 800 సూట్లు, 6వేల 800 జతల గాగుల్స్ ను ఓ షిప్ లో చైనాకి పంపింది.