హృదయవిదారకం, 13ఏళ్ల కొడుకు అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన తల్లి
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. అందరిని కరోనా వైరస్ చంపేస్తోంది. ప్రాణాలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. అందరిని కరోనా వైరస్ చంపేస్తోంది. ప్రాణాలు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. అందరిని కరోనా వైరస్ చంపేస్తోంది. ప్రాణాలు తీయడమే కాదు ఆఖరి చూపు కూడా దక్కనివ్వడం లేదు ఈ మహమ్మారి. లండన్ లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 13ఏళ్ల కుర్రాడు కరోనాకి బలయ్యాడు. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. చివరికి తల్లి అంత్యక్రియలకు కూడా హాజరుకాలేకపోయింది. కుటుంబసభ్యులు లేకుండానే పిల్లాడి అంత్యక్రియలను అధికారులే పూర్తి చేశారు.
సౌత్ లండన్ లోని బ్రిక్స్ టన్ కు చెందిన ఇస్మాయిల్ మహమ్మద్ కు కరోనా సోకింది. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కింగ్స్ కాలేజీ ఆసుపత్రిలో మరణించాడు. శుక్రవారం(ఏప్రిల్ 3,2020) అతడి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే కుటుంబసభ్యులు ఎవరూ హాజరు కాలేకపోయారు. దీనికి కారణం సెల్ఫ్ క్వారంటైన్. ఇస్మాయిల్ కరోనాతో చనిపోవడంతో అధికారులు అతడి తల్లిని, అతడి ఆరుగురు సోదరులను ఐసోలేషన్ లో ఉంచారు. ఇంటి నుంచి బయటకు రానివ్వ లేదు. కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకిందేమో అనే అనుమానంతో ముందు జాగ్రత్తగా అధికారులు వారిని ఐసోలేషన్ లో ఉంచారు. దీంతో కుటుంబసభ్యులు ఎవరూ లేకుండా ఇస్మాయిల్ అంత్యక్రియలను అధికారులే పూర్తి చేశారు.
ఇస్మాయిల్ కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అనుకోని విధంగా కరోనా సోకింది. మార్చి 26న ఇస్మాయిల్ ఆసుపత్రిలో చేరాడు. అతడి నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపగా, రిపోర్టులో కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
Also Read | అమెరికా వరల్డ్ రికార్డ్ : 24గంటల్లో 1480 కరోనా మరణాలు