భార్యాభర్తల మధ్య గాజుగోడ..హృదయాన్ని పిండేసే దృశ్యం

  • Published By: veegamteam ,Published On : March 7, 2020 / 05:55 AM IST
భార్యాభర్తల మధ్య గాజుగోడ..హృదయాన్ని పిండేసే దృశ్యం

Updated On : March 7, 2020 / 5:55 AM IST

కరోనా భయం కట్టుకున్న భర్త భార్యతో మనస్ఫూర్తిగా మాట్లాడని దుస్థితికి నెట్టేసింది. భర్తకు భార్య..భార్యకు భర్త..తల్లికి బిడ్డా ఇలా బంధాలను కరోనా కట్టడి చేసేస్తోంది. గాల్లోనే కరోనా భయంతో గాల్లోనే తల్లీ బిడ్డలు కౌగలించుకున్న హృదయవిదారక ఘటనను ఇప్పటికీ మరచిపోలేకుండా ఉన్నాం.

అటువంటి మరో హృదయవిదారక ఘటన గుండెల్ని పిండేస్తోంది. కరోనా సోకిన 60 సంవత్సాల భర్త తన భార్యతో మాట్లాడాలని ఆశపడ్డాడు. కానీ హాస్పిటల్ లోని వార్డునుంచి బైటకు వెళ్లలేని పరిస్థితి. భర్త ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని ఎంతో ఆశతో వచ్చిన ఆ భార్య భర్త ఉన్న వార్డులోకి వెళ్లకూడదు.

దీంతో వారిద్దరి మధ్యా గాజుగోడ అడ్డుగా నిలబడింది. గాజు కిటికీకి అవతల భార్య..లోపల భర్తా మాట్లాడుకున్నారు. కానీ ఆ మాటలు బైటకు వినిపించవు. కానీ భార్యాభర్తలు మాట్లాడుకోవాలంటే..మాటలు వినిపించక్కర్లా..కంటి భాష చాలు. అందుకే ఆ భార్యాభర్తలు గాజుగోడ నుంచి మాట్లాడుకున్నారు. ఆ భర్త పేరు జీన్ కాంప్‌బెల్. ఆ భార్య పేరు డోరతి. 
చైనా పుట్టి పలు దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్ అమెరికాకు కూడా సోకింది. వాషింగ్టన్ లోని కిర్క్ ల్యాండ్ లోని లైఫ్ కేర్ సెంటర్ హాస్పిటల్‌లో గాజుగోడ మధ్య మాట్లాడుకున్న మనస్సులను బాధకు గురిచేసే భార్య భర్తల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ ఫోటోను చూసిన నెటిజన్లు..కరోనాతో దూరంగా ఉంటున్న ఆ భార్యాభర్తలు తిరిగి సంతోషంగా కలుసుకుంటారని..అతను పూర్తి ఆరోగ్యంగా..బలంగా మారి  బైటకు వస్తాడని..రావాలని కోరుకుంటున్నారు. 

See Also | CAAపై చర్చ జరగాల్సిందే..సభలో చర్చించి తీర్మానం చేద్దాం – కేసీఆర్