కరోనాతో ‘ముందుజాగ్రత్త’గా హాస్పటల్‌లో చేరిన బ్రిటన్ ప్రధాని

కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. ప్రముఖుల నుంచి సామాన్య, పేదలకు కూడా ఈ రాకాసి కబలిస్తోంది. వేల మంది మృతి చెందుతున్నారు. ప్రపంచం మొత్తం వణుకుతోంది. ఇప్పటికే అనేక దేశాల ప్రముఖ వ్యక్తులు దీని బారిన పడి..క్వారంటైన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. స్వయంగా ఈ విషయాన్ని వారే తెలియచేశారు కూడా. ప్రధాన మంత్రులు, రాణులు, సైనాధ్యక్షులు ఇలా..ఎందరినో వదిలిపెట్టలేదు. తాజాగా బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.
తన ఆరోగ్యం బాగానే ఉందని, ఏడు రోజుల క్వారంటైన్ పూర్తయ్యిందని స్వయంగా ఆయన వెల్లడించారు. ఇంకా స్వల్పంగా వైరస్ లక్షణాలు ఇంకా ఉన్నట్లు, శరీరంలో టెంపరేచర్స్ ఉందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం..వ్యాధి పూర్తిగా తగ్గేంత వరకు క్వారంటైన్ లోనే ఉంటానని జాన్సన్ అన్నారు.
ఇదిలా ఉంటే..బ్రిటన్ లో పరిస్థితి క్రిటికల్ గానే ఉంది. ఇప్పట్లో ఈ వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. ఈ వైరస్ కు చెక్ పెట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించింది బ్రిటన్. ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఇప్పటిదాక సుమారు 50 వేల కేసులు, దాదాపు 5 వేల మంది చనిపోయినట్లు దాక నమోదైనట్లు అంచనా.
See Also | దేశవ్యాప్తంగా రెడ్ జోన్‌లు: ఏపీలో ఏడు జిల్లాలు.. తెలంగాణలో మూడు!