Superbike Stunt : షాకింగ్ వీడియో.. బెడిసికొట్టిన బైక్ స్టంట్, ఎంత ఘోరంగా ఎగిరిపడ్డారో చూడండి
Dangerous Stunt On Superbike : బైక్ పై విన్యాసాలు చాలా ప్రమాదకరమైనవి. ప్రాణాపాయానికి దారి తీస్తాయనడానికి ఈ వీడియో ఒక ప్రధాన ఉదాహరణగా నిలిచింది.

Dangerous Stunt On Superbike (Photo : Google)
ఈ మధ్య కాలంలో బైక్ పై స్టంట్స్ చేయడం ఫ్యాషన్ గా మారింది. బైక్ పై స్టంట్స్ చేస్తూ వీడియోలు తీసుకోవడం, వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసుకుని మురిసిపోవడం కామన్ అయిపోయింది. అయితే, బైక్ తో విన్యాసాలు చాలా ప్రమాదకరం. ఒక్కోసారి ప్రాణాలే పోతాయి. ఏ మాత్రం తేడా జరిగినా ఊహించని ఘోరం జరిగిపోతుంది. తీవ్రంగా గాయాలపాలు కావడం ఖాయం. తాజాగా ఓ జంట చేసిన బైక్ స్టంట్ బెడిసికొట్టింది. వారిద్దరూ బైక్ పైనుంచి ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడ్డారు.
ఓ జంట బైక్ స్టంట్ చేయగా అది ఫెయిల్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఎక్కడ? ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. వీడియో మాత్రం తెగ వైరల్ అయ్యింది.
Also Read : బరితెగించిన స్కూల్ టీచర్.. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. వీడియో వైరల్
అది సూపర్ బైక్. ఓ వ్యక్తి ముందర కూర్చున్నాడు. అతడి వెనకాలే మహిళ ఉంది. ఆ మహిళ వెనుక నుంచి బైక్ ని చాలా స్పీడ్ గా నడుపుతోంది. ఆ వ్యక్తి రాడ్ ను పట్టుకుని అమాంతం దాన్ని గాల్లోకి లేపాడు. బైక్ ముందున్న చక్రాన్ని ఇద్దరూ కలిసి పైకి లేపారు. కాసేపు గాల్లో ఉంచగలిగారు. అయితే, కిందకు దింపడంలో వారు ఫెయిల్ అయ్యారు. సడెన్ గా నేలను తాకించడంతో బైక్ కంట్రోల్ తప్పింది. అంతే, ఆ ఇద్దరూ అమాంతం గాల్లో ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడ్డారు. ఆ జంట బైక్ పై నుంచి గాల్లోకి ఎగిరిపడిన తీరు చాలా షాకింగ్ గా ఉంది.
Also Read : మీ కక్కుర్తి పాడుగాను.. ఎక్కడా ప్లేస్ లేనట్లు బంకర్‌లో ఇదేం పాడుపని, వీడియో వైరల్
కాగా, బైక్ పై విన్యాసాలు చాలా ప్రమాదకరమైనవి. ప్రాణాపాయానికి దారి తీస్తాయనడానికి ఈ వీడియో ఒక ప్రధాన ఉదాహరణగా నిలిచింది. ఈ మధ్య కాలంలో బైక్ స్టంట్లు ఫ్యాషన్ అయిపోయాయి. కొంతమంది థ్రిల్ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే, మరికొందరు సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, పాపులారిటీ కోసం ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా బైక్స్ స్టంట్స్ ప్రాణాలకే ప్రమాదం అనేది అందరూ తెలుసుకోవాలి.
— Fck Around N Find Out (@FAFO_TV) November 7, 2023