వందల ఏళ్ల క్రితమే క్రెడిట్ కార్డులు

  • Published By: venkaiahnaidu ,Published On : February 3, 2019 / 01:54 PM IST
వందల ఏళ్ల క్రితమే క్రెడిట్ కార్డులు

Updated On : February 3, 2019 / 1:54 PM IST

క్రెడిట్ కార్డు ఒక్కటుంటే చాలు..జేబులో రూపాయి లేకున్నా ఫర్వాలేదు. ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు పొందటం కూడా చాలా ఈజీ అయిపోయింది. అయితే క్రెడిట్ కార్డులు వందల ఏళ్ల క్రితమే ఉన్నాయంట. క్రెడిట్ కార్డులు అప్పుడెలా ఉన్నాయనుకుంటున్నారా?

పూర్వకాలంలో ఒకచోటు నుంచి మరొక చోటుకి ప్రయాణించడానికి బస్సు, బైక్, కార్ల సదుపాయం ఉండేది కాదు. దీంతో గుర్రాలు, గుర్రపు బండ్లు, ఎద్దుల బండ్లనే ప్రజలు ప్రయాణానికి ఉపయోగించారు. అనేకమంది దూరప్రాంతాలు కూడా నడిచే వెళ్లేవారు. అయితే ఈ ప్రయాణసమయంలో దొంగలు వారి దగ్గర డబ్బులను దోచుకోకుండా రోమన్, గ్రీకు, యూరోపియన్ ప్రాంతాల్లో క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల వంటి వ్యవస్థను అమలు చేశారు. ఎవరైనా దూరప్రాంతాలకు వెళ్తుంటే తమ దగ్గర ఉన్న నగదును దగ్గరి బ్యాంకుల్లో జమ చేసేవారు. ఆ బ్యాంకులు వాటికి సంబంధించిన ప్రత్యేక ముద్ర ఉండే ఉంగరాన్ని ఇచ్చేవి.

ప్రయాణం చేసేవారు బసచేసే చోట గానీ, ఏదైనా వస్తువు కొన్నా, ఆహారం తిన్నా ఆ ముద్రతోనే బిల్లు చెల్లించేవారు. పేపర్ పై లేదా క్లాత్, తోలు పట్టీల వంటి వాటిపై బిల్లు మొత్తం రాసి ఆ ముద్ర వేసి సంతకం చేసేవారు. వ్యాపారులు ఆ బిల్లులను ఆ బ్యాంకు శాఖల్లో ఇచ్చి డబ్బులు తీసుకొనేవారు. టెక్నికల్ గా ఇది డెబిట్ కార్డు అన్నమాట. అయితే ఒక్కోసారి బ్యాంకుల్లో జమ చేసినదానికంటే ఎక్కువ ఖర్చుపెట్టేవారు ప్రజలు. దీంతో బ్యాంకులు వ్యాపారులందరికీ చెల్లించేసి ఎక్కువైన అమౌంట్ ను సదరు వ్యక్తి నుంచి వసూలు చేసేవి. అంటే ఇది క్రెడిట్ కార్డు.