Pakistan : సంక్షోభ పాకిస్థాన్‌లో మళ్లీ పెట్రో ధరల పెంపు…333 రూపాయలకు చేరిన పెట్రోల్

సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ దేశంలో తాజాగా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెరుగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య పాకిస్థాన్ శుక్రవారం పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలను మరోసారి పెంచింది.....

Pakistan : సంక్షోభ పాకిస్థాన్‌లో మళ్లీ పెట్రో ధరల పెంపు…333 రూపాయలకు చేరిన పెట్రోల్

Hikes Petrol Prices

Updated On : September 16, 2023 / 1:30 PM IST

Pakistan : సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ దేశంలో తాజాగా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెరుగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య పాకిస్థాన్ శుక్రవారం పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలను మరోసారి పెంచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రో ధరల పెరుగుతున్న ట్రెండ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.

Ganesh idol : హుబ్బళ్లి ఈద్గా మైదానంలో గణేష్ విగ్రహం ఏర్పాటుకు మున్సిపల్ అనుమతి

పెట్రోలు ధరలు లీటరుకు పాకిస్థాన్ రూపాయల్లో (PKR) 26.02, హై-స్పీడ్ డీజిల్ లీటరుకు 17.34 పాక్ రూపాయల చొప్పున పెంచారు. (Crisis Hit Pakistan Hikes Petrol And Diesel Prices) ఈ పెంపు రెండు వారాల్లో రెండవ సారి పెరుగుదల. పాకిస్థాన్‌లో పెట్రోల్ ఇప్పుడు లీటరుకు 333.38 పాక్ రూపాయలకు విక్రయిస్తున్నారు. హై-స్పీడ్ డీజిల్ ధర లీటరుకు 329.18 రూపాయలకు పెరిగింది.

Encounter : బారాముల్లాలో ఎన్‌కౌంటర్…ఉగ్రవాది హతం

ఈ నెల ప్రారంభంలో పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరలు తొలిసారిగా 300 బెంచ్ మార్కు స్థాయిని అధిగమించాయి. చారిత్రక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లకు దారితీసిన ఇటీవలి ఆర్థిక సంస్కరణల కారణంగా ఆ దేశంలో పెట్రోల్, విద్యుత్ ధరలు పెరిగాయి. నవంబర్‌లో జరగనున్న జాతీయ ఎన్నికలకు ముందు పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతతో పాటుగా ఆర్థిక పరిస్థితులు దిగజారాయి.