KFC Chicken Head : కె.ఎఫ్.సీ చికెన్లో కోడి తలకాయ, అవాక్కయిన కస్టమర్
కరకరలాడే కె.ఎఫ్.సీ చికెన్ అంటే తెలియాని వారుండరు. పైన కరకరగా, లోపల మెత్తగా... ఎంతో రుచిగా ఉండే కె.ఎఫ్.సీ చికెన్ ను మాంసప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు.

Kfc Chicken Head
KFC Chicken Head : కరకరలాడే కె.ఎఫ్.సీ చికెన్ అంటే తెలియాని వారుండరు. పైన కరకరగా, లోపల మెత్తగా… ఎంతో రుచిగా ఉండే కె.ఎఫ్.సీ చికెన్ ను మాంసప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. ఈతరహా ఫాస్ట్ ఫుడ్ కి ప్రపంచ వ్యాప్తంగా “కె.ఎఫ్.సీ”కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అయితే…. ఎంతో ఆతృతగా ఆ రుచిని ఆస్వాదిద్దామని వెళ్లిన ఒక మహిళా కస్టమర్ కు వింత అనుభవం ఎదురైంది. కె.ఎఫ్.సీ చికెన్ ఆర్డర్ చేసిన కస్టమర్.. అందులో ఏకంగా కోడి తలకాయ రావడంతో ఒక్కసారిగా అవాక్కయింది.
చదవండి : Best Foods : రన్నింగ్, జాగింగ్ చేసే వారికి బెస్ట్ ఫుడ్స్ ఇవే…
సౌత్ లండన్ లో నివసించే గాబ్రియేల్ అనే ఒక మహిళ, ట్వికెన్హామ్ అనే ప్రాంతానికి వెళ్లి… కె.ఎఫ్.సీ చికెన్ ఆర్డర్ చేసింది. ఆవురావురుమని తిందామని ప్యాకెట్ ఓపెన్ చేసిన ఆమెకు, అందులో సగం ఉడికిన కోడి తల కనిపించడంతో కొంత అసహనానికి గురైంది. చికెన్ అందరూ తింటారు, కాని ఇలా సగం ఉడికిన తల ఎలా తింటారంటూ.. గాబ్రియేల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పోస్ట్ కాస్తా వైరల్ అవడంతో.. రంగంలోకి దిగిన “కె.ఎఫ్.సీ” సంస్థ.. బ్రాండ్ ఇమేజ్ కు భంగం కలగకుండా నష్టనివారణ చర్యలు చేపట్టింది.
చదవండి : Best Food : మాంసాహారాన్ని మించిన ఆహారం ఇదే…
తాము ఫ్రెష్ చికెన్ తోనే తమ వంటకాలు తయారు చేస్తామనేందుకు ఇదొక నిదర్శనమని, అయితే ఇలా కోడి తల రావడం మాత్రం కొంత క్వాలిటీ తప్పిదమే అవుతుందని సంస్థ చెప్పుకొచ్చింది. వెంటనే గాబ్రియేల్ ను కలిసిన సంస్థ ప్రతినిధులు.. ఆమెను ఆమె కుటుంబ సభ్యులను లండన్ లోని తమ రెస్టారంట్ కు పిలిపించి వారికి ఉచితంగా “కె.ఎఫ్.సీ” మీల్స్ అందించినట్లు “కె.ఎఫ్.సీ” సంస్థ తెలిపింది. అంతే కాదు తమ స్పెషల్ రెసిపీలో ఉపయోగించే ముడిపదార్ధాలు ఎన్ని క్వాలిటీ చెక్ ధాటి వస్తాయో తెలుపుతూ గాబ్రియేల్ కు వివరించారట. ఇక గాబ్రియేల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన “కె.ఎఫ్.సీ చికెన్ హెడ్” పోస్ట్.. సూపర్ వైరల్ అయింది.
yum yum @KFC_UKI pic.twitter.com/hnTm8urQ3x
— Takeaway Trauma (@takeawaytrauma) December 20, 2021
Ahem ?️ pic.twitter.com/dM0xi1WLf9
— KFC UK (@KFC_UKI) December 22, 2021