Cyclone Gabrielle: ఎగిరి పడుతున్న సముద్రం, ఎత్తి కుదిపేస్తున్న గాలులు.. ఎమర్జెన్సీ ప్రకటించిన న్యూజీలాండ్‭

మంగళవారం ఉదయాన్నే ఉత్తర న్యూజిలాండ్‭ను పెనుగాలి కమ్మేసింది. ఆ దేశ ప్రజలు నిద్ర లేచేసరికి అంతా అల్లకల్లోలమైంది. ప్రస్తుతం 150 న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది సహాయక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు న్యూజీలాండ్ మీడియా పేర్కొంది. కొన్ని వారాల క్రితమే ఆక్లాండ్‌, ఉత్తర ఐలాండ్‌ ప్రాంతాలను భారీ తుపాను తాకింది. గత నెలలో ఆక్లాండ్‌ ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదై భారీగా వరదలు వచ్చాయి. ఈ వరదల్లో నలుగురు మరణించారు.

Cyclone Gabrielle: ఎగిరి పడుతున్న సముద్రం, ఎత్తి కుదిపేస్తున్న గాలులు.. ఎమర్జెన్సీ ప్రకటించిన న్యూజీలాండ్‭

Cyclone Gabrielle: New Zealand declares national state of emergency

Updated On : February 14, 2023 / 8:37 PM IST

Cyclone Gabrielle: ప్రశాంతంగా ఉండే న్యూజీలాండ్‭ను పెను ప్రళయం కలవరపెడుతోంది. గాబ్రియేల్ తుఫాను కారణంగా ఆ దేశం తీవ్ర పరిస్థితుల్ని ఎదుర్కుంటోంది. దీంతో దేశవ్యాప్తంగా అత్యవససర పరిస్థితి విధిస్తున్నట్లు న్యూజీలాండ్ ప్రధాన మంత్రి క్రిస్ హిప్‭కిన్స్ ప్రకటించారు. ప్రజలు నిద్ర నుంచి లేచే లోపే ఈ తుఫాను విపత్తుగా మారిందని ఆయన పేర్కొన్నారు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, 11 మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయని న్యూజీలాండ్ వాతావరణ శాఖ పేర్కొంది.

CJI Chandrachud: టెక్నాలజీ తెలియదని మొబైల్ ఫోన్ వదిలేస్తారా?.. హైకోర్టు న్యాయమూర్తులకు సీజేఐ స్ట్రాంగ్ మెసేజ్

కాగా, న్యూజీలాండ్ చరిత్రలో అత్యవసర పరిస్థితి విధించడం ఇది మూడవసారి. గతంలో రెండు సందర్భాల్లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. 2011లో క్రైస్ట్‌చర్చ్‌ భూకపం వచ్చినప్పుడు కొవిడ్ కారణంగా 2020లో అత్యవసర పరిస్థితి విధించారు. మళ్లీ మూడేళ్లకు గాబ్రియెల్ తుఫాను కారణంగా అత్యవసర పరిస్థితి విధించారు. దేశంలో ఉత్తర ఐలాండ్‌లోని కొన్ని భాగాల్లో 30 జాతీయ రహదారులు, పోర్టులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను ప్రభుత్వం మూసివేసింది. ఇక ఆక్లాండ్‌ ఎయిర్‌ పోర్టు నుంచి ప్రయాణించాల్సిన 55 విమానాలను రద్దు చేశారు. నేపియర్‌ ఎయిర్‌ పోర్టు ప్రాంతంలో ఫిబ్రవరి సగటు కంటే మూడు రెట్ల అధిక వర్షపాతం నమోదైందని, దీనిని అత్యంత తీవ్రమైన రెడ్‌ వార్నింగ్‌ న్యూజిలాండ్‌ వాతావరణ శాఖ పేర్కొంది.

Vertical Fin: బోయింగ్ 737 కోసం మొదటి వర్టికల్ ఫిన్ స్ట్రక్చర్‭ను తరలించిన టాటా బోయింగ్ ఏరోస్పేస్