Vertical Fin: బోయింగ్ 737 కోసం మొదటి వర్టికల్ ఫిన్ స్ట్రక్చర్‌ను తరలించిన టాటా బోయింగ్ ఏరోస్పేస్
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుకరన్ సింగ్ మాట్లాడుతూ, “బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్ కోసం మొదటి వర్టికల్ ఫిన్ స్ట్రక్చర్‌ను విజయవంతంగా రవాణా చేయడం టీబీఏఎల్ లోని బృందాల కృషి, తిరుగులేని సహకార ఫలితం. ఇది మొత్తం బోయింగ్ కార్యకలాపాలలో భారతదేశాన్ని ఒక ముఖ్యమైన తయారీ స్థావరంగా నిలిపింది

Tata Boeing Aerospace moves first vertical fin structure for Boeing 737
Vertical Fin: టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్) హైదరాబాద్‌లోని అత్యాధునిక కేంద్రం నుంచి బోయింగ్ 737 విమానం కోసం వర్టికల్ ఫిన్ నిర్మాణాన్ని రవాణా చేసింది. బోయింగ్ 737 ఎయిర్ క్రాఫ్ట్‌లో అమర్చేందుకు వర్టికల్ ఫిన్ రెంటన్, డబ్ల్యూఏలోని బోయింగ్ తయారీ కేంద్రానికి డెలివరీ అవుతుంది. కాగా, ఈ విషయమై బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తే స్పందిస్తూ ‘‘ప్రపంచం కోసం భారతదేశంలోని ఏరోస్పేస్, డిఫెన్స్‌లలో సమీకృత వ్యవస్థల అభివృద్ధికి ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యం ప్రతిబింబించడం పట్ల బోయింగ్ నిబద్ధతకు టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఒక ఉదాహరణ. మొదటి వర్టికల్ ఫిన్ తయారు చేసిన వేగం, నాణ్యత టీబీఏఎల్ యొక్క నైపుణ్యం కలిగిన సిబ్బంది, ఇంజనీరింగ్ ప్రతిభ, ప్రపంచ స్థాయి తయారీ సామర్థ్యాలకు నిదర్శనం’’ అని అన్నారు.
Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు
వర్టికల్ ఫిన్ అనేది విమానం తోకపై అమర్చే వర్టికల్ స్థిరీకరణ ఉపరితలం. ఇది స్థిరత్వం, నియంత్రణను అందిస్తుంది. కొత్త ఉత్పత్తి శ్రేణి అత్యాధునిక రోబోటిక్స్, ఆటోమేషన్, తయారీ ప్రక్రియలలో పూర్తి స్థాయి డిటర్మినెంట్ అసెంబ్లీ వంటి అధునాతన ఏరోస్పేస్ భావనలను ఉపయోగించుకుంటుంది. టీబీఏఎల్ 2021లో 737 రకానికి చెందిన విమానాల కోసం సంక్లిష్టమైన వర్టికల్ ఫిన్ నిర్మాణాలను తయారు చేయడానికి ఒక కొత్త ఉత్పత్తి శ్రేణిని జత చేసింది. ఈ విస్తరణ జాయింట్ వెంచర్‌కు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఇది నైపుణ్యం అభివృద్ధిని ఎనేబుల్ చేస్తూ అదనపు ఉపాధి అవకాశాలను కూడా సృష్టించింది.
Adani Group Stocks : అయ్యో అదానీ.. భారీ పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్ ఎదురుచూపులు
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుకరన్ సింగ్ మాట్లాడుతూ, “బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్ కోసం మొదటి వర్టికల్ ఫిన్ స్ట్రక్చర్‌ను విజయవంతంగా రవాణా చేయడం టీబీఏఎల్ లోని బృందాల కృషి, తిరుగులేని సహకార ఫలితం. ఇది మొత్తం బోయింగ్ కార్యకలాపాలలో భారతదేశాన్ని ఒక ముఖ్యమైన తయారీ స్థావరంగా నిలిపింది. నాణ్యత, సకాలంలో డెలివరీపై బలమైన దృష్టితో దేశీయ అంతరిక్ష తయారీ పురోగతికి మేం కట్టుబడి ఉన్నాం” అని అన్నారు.