Hyderabad Cricket Association: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ (హెచ్‌సీఏ)ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను, తదుపరి తీసుకోవాల్సిన చర్యలను ఆ కమిటీనే చూసుకుంటుందని సుప్రీంకోర్టు తెలిపింది.

Hyderabad Cricket Association: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు

SC gets two new judges as Centre clears their appointment, apex court now has full strength

Updated On : February 14, 2023 / 6:42 PM IST

Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ (హెచ్‌సీఏ)ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను, తదుపరి తీసుకోవాల్సిన చర్యలను ఆ కమిటీనే చూసుకుంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నివేదిక ప్రకారం తదుపరి ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది.

హెచ్‌సీఏ ఎన్నికల వివాదంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే బాధ్యతను ఇక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు కమిటీ చూసుకుంటుంది. జస్టిస్ దీపక్ వర్మను అంబుడ్స్ మన్ గా నియమించిన కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. గత ఏడాది డిసెంబరు 11న హెచ్‌సీఏ జనరల్‌ బాడీ సమావేశం కూడా జరిగింది.

వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని అందులో తీర్మానించినట్లు అధికారులు అప్పట్లో తెలిపారు. అందుకు రిటైర్డ్‌ చీఫ్‌ ఎన్నికల అధికారి సంపత్‌ ను తమ ఎన్నికల అధికారిగా ఎంపిక చేశామని అన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చాలా కాలంగా వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ పదవీ కాలం ముగియడం, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, హైదరాబాద్ లో జరిగిన మ్యాచుల టికెట్ల వ్యవహారం వంటివి చర్చనీయాంశంగా మారాయి.

Poor-Quality Food: రైళ్లలో ఇలాంటి ఆహారమా అందించేది?: ఫొటో పోస్ట్ చేసి మహిళ ఆగ్రహం