India Imports : చైనా నుంచి భారత్ కి తగ్గుతున్న దిగుమతులు

భారత్ నుంచి చైనాకు 2020-21 నాటికి 21.19 మిలియన్ డాలర్లకు ఎగుమతులు పెరిగాయి. గత నాలుగేళ్లలో 63.05 మిలియన్ డాలర్ల నుంచి 44.02 మిలియన్ డాలర్లకు దిగుమతులు తగ్గాయి.

India Imports : చైనా నుంచి భారత్ కి తగ్గుతున్న దిగుమతులు

India China

Updated On : February 4, 2022 / 7:12 PM IST

China-India : చైనా నుంచి భారత్ కి దిగుమతులు క్రమంగా తగ్గుతున్నాయి. అదేక్రమంలో భారత్ నుంచి చైనాకు ఎగుమతులు పెరుగుతున్నాయి. 2017-18లో చైనా నుంచి భారత్ కు 76.38 మిలియన్ డాలర్ల దిగుమతులు జరిగాయి. 2020-21 నాటికి చైనా నుంచి 65.21 మిలియన్ డాలర్లకు దిగుమతులు తగ్గాయి. ఇదిలావుంటే 2017-18లో భారత్ నుంచి చైనాకు ఎగుమతులు 13.33 మిలియన్ డాలర్లు ఉన్నాయి.

భారత్ నుంచి చైనాకు 2020-21 నాటికి 21.19 మిలియన్ డాలర్లకు ఎగుమతులు పెరిగాయి. గత నాలుగేళ్లలో 63.05 మిలియన్ డాలర్ల నుంచి 44.02 మిలియన్ డాలర్లకు దిగుమతులు తగ్గాయి. రాజ్యసభలో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Bandi Srinivas : ఏ పద్ధతిన ప్రభుత్వం పీఆర్సీ ఫిక్స్ చేసింది..?

చైనాతో జరిగే వాణిజ్యంలో సమతూకాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ద్వారా దిగుమతి భారాన్ని తగ్గించుకుంటూ దేశీయంగా తయారీని ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ పథకం జాబితాలో యాక్టివ్ ఫార్మా ఇంగ్రెడియంట్స్, వైద్య పరికరాలు, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, వైట్ గూడ్స్ (ఏసీలు, ఎల్ఈడీలు), స్పెషాలిటీ స్టీల్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, హై ఎఫిషియన్సీ సోలార్ పీవీ ప్యానెళ్లు, డ్రోన్లు – డ్రోన్ విడిభాగాలు వంటివి ఉన్నాయని వెల్లడించారు.