Russia Ukraine war : యుక్రెయిన్, రష్యా యుద్ధం ముగుస్తుందా?..కొనసాగుతుందా?
కాసేపటి క్రితం యుక్రెయిన్ రష్యాకు భిన్నమైన ప్రకటన చేసింది . యుద్ధంలో నైతిక విజయం తమదేనని, రష్యా మానసిక స్థైర్యం కోల్పోయిందని, బలహీనపడిందని ఆరోపించింది.

Meeting
Russia and Ukraine discussions : అందరి చూపు బెలారస్‌వైపే ఉంది. యుద్ధం ముగుస్తుందో..కొననసాగుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. మరికాసేపట్లో బెలారస్‌లో రష్యా, యుక్రెయిన్ ప్రతినిధులకు మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. అవసరమైతే చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తానని తెలిపింది వాటికన్‌సిటీ. అయితే చర్చలకు ముందు బెలారస్ సంచలన ప్రకటన చేసింది. రష్యాపై ఆంక్షలు మరిన్ని పెంచితే…మూడో ప్రపంచయుద్ధం తప్పదని హెచ్చరించింది. మరోవైపు చర్చలకు ముందు రష్యా, యుక్రెయిన్ చేస్తున్న ప్రకటనలు తీవ్ర గందరగోళంగా ఉన్నాయి. యుక్రెయిన్ ఎయిర్‌స్పేస్ మొత్తం తమ ఆధీనంలో ఉందని రష్యా తాజాగా ప్రకటించింది.
కాసేపటి క్రితం యుక్రెయిన్ రష్యాకు భిన్నమైన ప్రకటన చేసింది . యుద్ధంలో నైతిక విజయం తమదేనని, రష్యా మానసిక స్థైర్యం కోల్పోయిందని, బలహీనపడిందని ఆరోపించింది. పౌరుల నివాసాలపైనా రష్యా ఆర్మీ దాడులు చేసిందని, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా యుక్రెయిన్‌ను ఆక్రమించుకోలేకపోయిందని ఆరోపించింది. అయితే యుక్రెయిన్ ఆరోపణలను తోసిపుచ్చింది రష్యా. ప్రజలను యుక్రెయిన్ ఆర్మీ మానవకవచంలా వాడుకుంటోందని ఎదురుదాడి చేసింది. రష్యా దళాలకు యుక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఉందని బ్రిటన్ అంటోంది. కీవ్‌కు 30కిలోమీటర్ల దూరంలోనే రష్యా బలగాలు నిలిచిపోయాయని బ్రిటన్ ప్రకటించింది.
Ukraine-Russia Crisis : రష్యా సైనిక కాన్వాయ్‌ను పేల్చేసిన యుక్రెయిన్ డ్రోన్లు.. వీడియో..!
మరోవైపు యుద్ధం, ఆంక్షలతో రష్యా ఆర్థికవ్యవస్థ పతనమవుతోంది. ఇది భారంగా మారడంతో ఆర్థికవ్యవస్థను మెరుగుపరిచేందుకు కీలకనిర్ణయాలు తీసుకుంటోంది రష్యా. వడ్డీరేట్లను 9.5శాతం నుంచి ఏకంగా 20శాతానికి పెంచింది సెంట్రల్ బ్యాంక్. విదేశీ కరెన్సీలో ఉన్న ఆదాయాన్ని 80శాతం అమ్ముకుని రూబుల్ కొనాలనీ ఆదేశించింది. అటు యుక్రెయిన్ ప్రజలను శరణార్థులుగా మార్చుతోంది యుద్ధం. యుద్ధం మొదలయిన తర్వాత 4లక్షలమంది పౌరులు
యుక్రెయిన్‌ను వీడి వెళ్లిపోయారు.