United Kingdom : మహిళకు క్యాన్సర్ నుంచి విముక్తి.. డాక్టర్లు ఇచ్చిన వండర్ డ్రగ్ ఏంటంటే?

క్యాన్సర్ సోకిన ఓ మహిళ జీవితంలో మిరాకిల్ జరిగింది. వైద్యులు సూచించిన ఓ డ్రగ్ ఆమె ప్రాణాలు కాపాడింది. ఏంటా డ్రగ్?

United Kingdom : మహిళకు క్యాన్సర్ నుంచి విముక్తి.. డాక్టర్లు ఇచ్చిన వండర్ డ్రగ్ ఏంటంటే?

United Kingdom

Updated On : October 8, 2023 / 10:08 AM IST

United Kingdom : 42 ఏళ్ల మహిళకు క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. కానీ డాక్టర్లు ఇచ్చిన వండర్ డ్రగ్‌తో ఆరు నెలల్లో క్యాన్సర్ పూర్తిగా అదృశ్యం అయిపోయింది. ఇంతకీ డాక్టర్లు ఆమెకు ఏం ఇచ్చారు?

Male Baldness : పురుషుల్లో త్వరగా బట్టతల రావడం క్యాన్సర్‌కు సంకేతమా?

క్యాన్సర్ ప్రాణాంతకమే .. కానీ దానిని ప్రాథమిక దశలో గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా కొన్ని సర్జరీలు, కీమోథెరపి, రేడియేషన్ థెరపి వంటివి చేస్తారు. అయితే యూకేకి చెందిన 42 మహిళకు డాక్టర్లు ఇచ్చిన కొత్త ఔషధం ఆమెను క్యాన్సర్ నుంచి కాపాడింది. వేల్స్‌కు చెందిన ఆమె మూడవ దశ ప్రేగు క్యాన్సర్‌తో పోరాడుతోంది. అయితే ఆమెతో డాక్టర్లు ‘దోస్టార్‌లిమాబ్’ (Dostarlimab Infusions) అనే కషాయం వాడించారు.

ఆరు నెలల పాటు దోస్టార్‌లిమాబ్ కషాయం వాడిన మహిళకు పూర్తిగా క్యాన్సర్ నయం అయ్యిందట. డ్రగ్ వాడిన తరువాత చేసిన పరీక్షలో ఆమె శరీరంలో క్యాన్సర్ తాలుకు ఎటువంటి ఆధారాలు దొరకలేదట. అయితే ఈ డ్రగ్ వైద్యపరంగా ట్రయల్ చేయబడుతోందట. శస్త్ర చికిత్స, రేడియోథెరపి, కీమోథెరపి వంటివి అవసరం లేకుండా ఇది అద్భుత ఫలితాలను ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. దోస్టార్లిమాబ్ అనేది ఇమ్యునోథెరపీ కోసం వాడే డ్రగ్. ఇది రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్‌ను నాశనం చేయడంలో సహాయపడుతుందట. సింగిల్టన్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ క్రెయిగ్ బారింగ్‌టన్‌కు సూచనతో ఆమె ఈ డ్రగ్ వాడిందట.

Cancer blood tests : క్యాన్సర్ కు రక్త పరీక్ష వచ్చేసింది

క్యాన్సర్‌ను జయించిన మహిళ ప్రస్తుతం తిరిగి తన ఉద్యోగంలో చేరడానికి సిద్ధమవుతోందట. ఈ కొత్త చికిత్సతో తనకు క్యాన్సర్‌ను నయం చేసిన డాక్టర్ బారింగ్‌టన్, అతని బృందానికి ఆ మహిళ కృతజ్ఞతలు చెప్పింది. ఈ డ్రగ్ సత్ఫలితాలను ఇస్తే భవిష్యత్తులో  క్యాన్సర్ రోగుల పాలిట వరం కావచ్చు.