అబ్బా.. అడ్డంగా దొరికిపోయిన ట్రంప్.. ఇదిగో సాక్ష్యం.. పాకిస్థాన్‌లో అంట…
పాకిస్థాన్‌లో పెద్ద ఎత్తున ఆయిల్ నిక్షేపాలు బయటపడ్డాయనే వాదన 2019లో మొదలైంది. ఇమ్రాన్ ఖాన్ ఫస్ట్ టైమ్ దీని గురించి ప్రకటించారు.

Shehbaz Sharif Donal Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ డ్రంప్ అడ్డంగా దొరికిపోయారు. భారత్ మీద ఎందుకంత కోపమో.. పాకిస్థాన్ మీద ఎందుకు అంత ప్రేమో తెలీదు కానీ.. ఇండియాపై 25 శాతం టారిఫ్ విధించిన ట్రంప్.. పాకిస్థాన్ విషయంలో మాత్రం ప్రేమ ఒలకబోశారు. గతంలో 29శాతం ఉన్న టారిఫ్‌లను 19శాతానికి తగ్గించారు. దీంతోపాటు బోనస్‌గా ఆ దేశంతో డీల్ కూడా సెట్ చేశారు. పాకిస్థాన్ నుంచి అమెరికా ఆయిల్ దిగుమతి చేసుకుంటుందని ప్రకటించారు. రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నందుకు, ఆయుధాలు కొంటున్నందుకు టారిఫ్‌లతో పాటు పెనాల్టీ కూడా విధించిన ట్రంప్ పాకిస్థాన్‌తో మాత్రం ఆయిల్ డీల్ సెట్ చేశారు.
ఇక్కడే ట్రంప్ అడ్డంగా దొరికిపోయారు..
పాకిస్థాన్‌లో ఆయిల్ లీటర్ 272 పాకిస్థానీ రూపాయలు. అంత పెద్ద స్థాయిలో ఆయిల్ రిజర్వ్స్‌లు ఉంటే ఏకంగా 272 రూపాయలు పెట్టి కొనాల్సిన అవసరం ఏమొచ్చింది. అదే టైమ్‌లో పాకిస్థాన్లోకి దొంగతనంగా కూడా ఆయిల్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి. ఇరాన్ నుంచి అడ్డదారిలో ఆయిల్ పాకిస్థాన్ చేరుతుంది. అమెరికాకి ఎగుమతి చేసేంత స్థాయిలో అంత పెద్ద ఆయిల్, గ్యాస్ రిజర్వ్స్ పాకిస్థాన్‌లో ఉంటే వాళ్లకు 272 రూపాయలు పెట్టి కొనాల్సిన ఖర్మేంటి? ఇరాన్ నుంచి స్మగ్లింగ్
చేయాల్సిన అవసరం ఏమిటి..?
అసలు ఈ ఆయిల్ డ్రామా ఎప్పుడు మొదలైంది?
పాకిస్థాన్‌లో పెద్ద ఎత్తున ఆయిల్ నిక్షేపాలు బయటపడ్డాయనే వాదన 2019లో మొదలైంది. ఇమ్రాన్ ఖాన్ ఫస్ట్ టైమ్ దీని గురించి ప్రకటించారు. ఆసియాలోనే అతి పెద్ద ఆయిల్ నిక్షేపాలు అయితే, అదంతా తూచ్ అని సాక్షాత్తూ ఆ దేశ పెట్రోలియం విభాగం స్పష్టం చేసింది. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. సాక్షాత్తూ కరాచీ నుంచి నడిచే డాన్ పత్రిక 2024లో తెలిపింది. ‘5500 మీటర్ల వరకు డ్రిల్లింగ్ జరిగింది. కానీ, ఎలాంటి ఆయిల్ నిక్షేపాలు దొరకలేదు. ఇంకా డ్రిల్లింగ్ ఆపేశాం’ అని ప్రకటించింది. 2024లోనే డాన్ న్యూస్ రిపోర్ట్ చేసిన మరో కథనం ప్రకారం పెద్ద ఆయిల్ డ్రిల్లింగ్ కంపెనీలైన టోటల్, షెల్, ఈని లాంటి సంస్థలు పాకిస్థాన్ నుంచి వెళ్లిపోయాయి. ఎందుకంటే అక్కడ ఆయిల్ లేదు. దీంతోపాటు అక్కడ సెక్యూరిటీ సమస్య వలన గుడ్ బై చెప్పేశాయి.
అసలు పాకిస్థాన్‌లో ఎంత ఆయిల్ ఉంది?
2016 ఆయిల్ నిల్వల డేటా ప్రకారం 353.5 మిలియన్ బ్యారెళ్లు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని ఆయిల్ నిల్వల్లో పాకిస్థాన్ 52వ స్థానంలో ఉంది. ఒక రకంగా ప్రపంచంలోని ఆయిల్ నిల్వల్లో 0.021 శాతం మాత్రమే. ఇక ఇండియాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ విషయానికి వస్తే 4.9 బిలియన్ బ్యారెళ్ల నిల్వలు ఉన్నాయి. అంటే ప్రపంచ నిల్వల్లో 25వ స్థానంలో ఉందన్నమాట. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే.. పాకిస్థాన్ కు పక్కలో బల్లెంలా మారిన బలూచిస్థాన్ లో ఆయిల్ నిల్వలు ఎక్కువ ఉన్నాయి. అటు బలూచ్ మాత్రం పాకిస్థాన్ మీద తిరుగుబాటు చేస్తోంది.