డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల మోత.. పాకిస్థాన్ దిగుమతులపై మాత్రం భారీగా తగ్గింపు.. అత్యధికంగా సిరియాపై 41శాతం టారిఫ్.. భారత్‌పై మాత్రం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల మోత మోగించాడు. దాదాపు 70 దేశాలపై ఉన్న సుంకాలను పెంచారు. అత్యధికంగా సిరియాపై 41శాతం టారిఫ్ ను విధించారు.

Donald Trump
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల మోత మోగించాడు. దాదాపు 70 దేశాలపై ఉన్న సుంకాలను పెంచారు. అత్యధికంగా సిరియాపై 41శాతం టారిఫ్ ను విధించారు. పాకిస్థాన్ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై మాత్రం 29శాతంగా ఉన్న టారిఫ్ లను 19శాతానికి తగ్గించడం గమనార్హం. 10 శాతం నుంచి 41శాతం వరకు పరస్పర సుంకాలను విధించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేశారు.
పరస్పర సుంకాల నేపథ్యంలో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఆగస్టు 1 వరకు ట్రంప్ గడువు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన సుంకాలను సవరించారు. ఈ సవరించిన టారిఫ్ లు ఏడు రోజుల్లో అమల్లోకి రానున్నాయి. అయితే, భారత్, కెనడా దేశాల నుంచి దిగుమతులపై విధించిన టారిఫ్ లు మాత్ర ఆగస్టు 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని ఇప్పటికే ట్రంప్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ జాబితాలో లేని దేశాల నుంచి దిగుమతి అయ్యే అవస్తువులపై 10శాతం సుంకం ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
తాజాగా ట్రంప్ ప్రకటించిన సుంకాల వివరాల ప్రకారం.. కెనడా నుంచి వచ్చే దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 25శాతం సుంకాన్ని 35శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. బ్రెజిల్ పై ఇప్పటికే ఉన్న 10శాతం సుంకాలకు అదనంగా 40శాతం జత చేశారు. సిరాయా దిగుమతులపై అత్యధికంగా 41శాతం టారిఫ్ ను ట్రంప్ విధించారు. ఇక భారత దేశం నుంచి వచ్చే దిగుమతులపై 25శాతం టారిఫ్ ఉంటుందని ట్రంప్ చెప్పారు. అయితే, మన పొరుగు దేశం పాకిస్థాన్ పై మాత్రం ట్రంప్ మరోసారి ప్రేమను చూపించాడు. ప్రస్తుతం పాకిస్థాన్ దేశం నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 29శాతం టారిఫ్ ఉండేది.. దానిని 19శాతంకు తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఇప్పటికే మన దాయాది దేశం పాకిస్థాన్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిద్వారా దక్షిణాసియాలో అతి పెద్ద చమురు నిల్వ దేశంతో కలిసి పనిచేయనున్నామని వెల్లడించారు. ఏదో ఒకరోజు భారత్‌కూ పాకిస్థాన్ చమురు విక్రయించే రోజు రావొచ్చని తన సోషల్ ట్రూత్ లో ట్రంప్ వ్యాఖ్యానించి భారత్ ను కించపర్చే ప్రయత్నం చేశాడు. తాజాగా.. పాకిస్థాన్ దేశం నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ టారిఫ్‌ను భారీగా తగ్గించడం గమనార్హం.
దేశాల వారిగా అమెరికా కొత్త టారిఫ్‌లు ..
భారతదేశం-25శాతం
పాకిస్తాన్-19శాతం
శ్రీలంక-20శాతం
బంగ్లాదేశ్-20శాతం
ఇండోనేషియా-19శాతం
ఇరాక్-35శాతం
ఇజ్రాయెల్-15శాతం
జపాన్-15శాతం
జోర్డాన్-15శాతం
మలేషియా-19శాతం
కజకిస్తాన్-25శాతం
ఆఫ్ఘనిస్తాన్ -15శాతం
అల్జీరియా-30శాతం
వియత్నాం-20శాతం
అంగోలా-15శాతం
బొలీవియా-15శాతం
బోస్నియా మరియు హెర్జెగోవినా-30శాతం
బోట్స్వానా-15శాతం
బ్రెజిల్-10శాతం
బ్రూనై-25శాతం
కంబోడియా-19శాతం
కామెరూన్-15శాతం
చాడ్-15శాతం
కోస్టా రికా-15శాతం
కోట్ డి ఐవోయిర్-15శాతం
కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్-15శాతం
ఈక్వడార్-15శాతం
ఈక్వటోరియల్ గినియా-15శాతం
ఫాక్లాండ్ దీవులు-10శాతం
ఫిజీ-15శాతం
ఘనా-15శాతం
వనువాటు-15శాతం
గయానా-15శాతం
ఐస్లాండ్-15శాతం
లావోస్-40శాతం
లెసోతో-15శాతం
లిబియా-30శాతం
లీచ్టెన్‌స్టెయిన్-15శాతం
మడగాస్కర్-15శాతం
మలావి-15శాతం
మారిషస్-15శాతం
మోల్డోవా-25శాతం
మయన్మార్ (బర్మా)-40శాతం
మొజాంబిక్-15శాతం
నమీబియా-15శాతం
నౌరు-15శాతం
న్యూజిలాండ్-15శాతం
నికరాగ్వా-18శాతం
నైజీరియా-15శాతం
ఉత్తర మాసిడోనియా-15శాతం
నార్వే-15శాతం
పాపువా న్యూ గినియా-15శాతం
ఫిలిప్పీన్స్-19శాతం
సెర్బియా-35శాతం
దక్షిణాఫ్రికా-30శాతం
దక్షిణ కొరియా-15శాతం
స్విట్జర్లాండ్-39శాతం
సిరియా-41శాతం
తైవాన్-20శాతం
థాయిలాండ్-19శాతం
ట్రినిడాడ్ మరియు టొబాగో-15శాతం
ట్యునీషియా-25శాతం
టర్కీ-15శాతం
ఉగాండా-15శాతం
యునైటెడ్ కింగ్‌డమ్-10శాతం
వెనిజులా-15శాతం
జాంబియా-15శాతం
జింబాబ్వే-15శాతం