USA : డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి

ట్రంప్ తన కార్యవర్గంలో కీలక వ్యక్తులను నియమిస్తూ వస్తున్నారు. వీరిలో భారతీయ మూలాలు కలిగిన వ్యక్తులకు కీలక పదవులు కేటాయించారు. తాజాగా..

USA : డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి

Kash Patel

Updated On : December 1, 2024 / 7:44 AM IST

Kashyap patel: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న ఆయన రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవలి ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించిన నాటినుంచి ట్రంప్ తన కార్యవర్గంలో కీలక వ్యక్తులను నియమిస్తూ వస్తున్నారు. వీరిలో భారతీయ మూలాలు కలిగిన వ్యక్తులకు కీలక పదవులు కేటాయించారు. ఇప్పటికే , వివేక్ రామస్వామికి ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు అప్పగించిన ట్రంప్.. అమెరికాలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)కు తదుపరి డైరెక్టర్ గా జై భట్టాచార్యను నియమించారు. తాజాగా మరో భారత సంతతికి చెందిన వ్యక్తికి ట్రంప్ కీలక పదవిని కట్టబెట్టారు. కశ్యప్ పటేల్ (కాష్ పటేల్)ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్ గా నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

Also Read: jay bhattacharya: అమెరికాలో ఎన్ఐహెచ్ డైరెక్టర్‌గా జై భట్టాచార్య.. ట్రంప్ కార్యవర్గంలో మరో భారతీయ వ్యక్తి

డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ట్రూత్’ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘’ఎఫ్‌బీఐ తదుపరి డైరెక్టర్ గా కశ్యప్ పటేల్ పనిచేస్తారు. అతను ఒక తెలివైన న్యాయవాది, పరిశోధకుడు. అమెరికాలో అవినీతి నిర్మూలనకు, న్యాయాన్ని గెలిపించేందుకే నిరంతరం శ్రమిస్తున్నారు. అమెరికా ప్రజలకు అండగా నిలిచారు. ఆయన నియామకంతో ఎఫ్‌బీఐకి పూర్వవైభవం తీసుకొస్తాం’’ అని ట్రంప్ పేర్కొన్నారు. తన మొదటి పదవీకాలంలో పటేల్ చేసిన సేవలను ట్రంప్ ప్రశంసించారు.

Also Read: India Super Power : చైనా, పాకిస్తాన్‌కు ఇక చుక్కలే? మిలటరీ సూపర్‌ పవర్‌గా ఎదుగుతున్న భారత్‌..

ట్రంప్ కు వీరవిధేయుడిగా కశ్యప్ పటేల్ కు పేరుంది. కశ్యప్ కుటుంబమూలాలు గుజరాత్ లో ఉన్నాయి. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. అతడి తండ్రి ఉగాండలో నియంత ఈదీ అమిన్ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలస వెళ్లారు. న్యూయార్క్ లోని గార్డెన్ సిటీ 1980లో కశ్యప్ జన్మించాడు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్ మాండ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి యూనివర్శిటీ కాలేజ్ లండన్ లో న్యాయవిద్యను పూర్తి చేశాడు. ఆ తరువాత ఓ లా సంస్థలో పని చేయాలనుకున్నా కొలువు లభించలేదు. దీంతో అతడు మియామీ కోర్టులో పబ్లిక్ డిఫెండర్ గా పనిచేసి వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఒబామా పాలనలో కశ్యప్ పటేల్ కొంతకాలం న్యాయశాఖలో పనిచేశారు. ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తరువాత అతను 2017 -2018లో హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీకి నాయకత్వం వహించినప్పుడు మాజీ ప్రతినిధి డెవిన్ న్యూన్స్, ఆర్-కాలిఫోర్నియాకు సీనియర్ న్యాయవాదిగా రెండు సంవత్సరాలు సేవలందించారు. 2018లో, అతను నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో ఉగ్రవాద నిరోధకానికి ట్రంప్ సీనియర్ డైరెక్టర్‌గా పనిచేశాడు.

Kashyap patel