India Super Power : చైనా, పాకిస్తాన్‌కు ఇక చుక్కలే? మిలటరీ సూపర్‌ పవర్‌గా ఎదుగుతున్న భారత్‌..

ఆర్థిక వ్యవస్థతో పాటు రక్షణ రంగం ఎంత స్ట్రాంగ్ గా ఉందన్న దాని మీదే దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది.

India Super Power : చైనా, పాకిస్తాన్‌కు ఇక చుక్కలే? మిలటరీ సూపర్‌ పవర్‌గా ఎదుగుతున్న భారత్‌..

Updated On : December 1, 2024 / 1:10 AM IST

India Super Power : యుద్ధం గెలవడానికి వ్యూహం ఎంత అవసరమో.. యుద్ధం చేయడానికి ఆయుధమూ అంతే అవసరం. రెండూ ఉంటే శత్రువు వణికిపోవాల్సిందే. ఇదే ఫార్ములాను పక్కాగా ఫాలో అవుతోంది భారత్. రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటోంది. రికార్డ్ కేటాయింపులు జరిపిన కేంద్రం.. అధునాతన ఆయుధాలను సమకూర్చుకోవడంతో పాటు శత్రువు వెన్నులో వణుకు పుట్టించే పరీక్షలు నిర్వహిస్తోంది. మన భూభాగంపై కన్నేయడం కాదు కదా కన్నెత్తి చూసినా అంతు చూస్తామని వార్నింగ్ ఇస్తోంది.

ఆర్థిక వ్యవస్థతో పాటు రక్షణ రంగం ఎంత స్ట్రాంగ్ గా ఉందన్న దాని మీదే దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈ నియమాన్ని భారత్ పక్కాగా ఫాలో అవుతోంది. ఆర్థిక వ్యవస్థను అభివృద్ది పధంలో నడిపించే ప్రయత్నం చేస్తూనే రక్షణ రంగ పరంగా భారత్ ను సూపర్ పవర్ గా నిలిపే ప్రయత్నం చేస్తోంది.

మొన్న హైపర్ సోనిక్ మిస్సైల్, ఇప్పుడు సబ్ మెరైన్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణి.. సక్సెస్ ఫుల్ ప్రయోగాలతో శత్రువు గుండెల్లో భారత్ దడ పుట్టిస్తోంది భారత్ కు చెందిన అణు జలాంతర్గామి ఐఎఎన్ఎస్ అరిఘాత్ నుంచి మొదటి సారి కే-4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణి 3వేల 500 కిలోమీటర్ల రేంజ్ ను ఈజీగా టార్గెట్ చేసింది. ఈ ప్రయోగం దేశ రక్షణ సామర్థ్యాల్లో ఓ మైలురాయి.

నింగి, నేల, నీరు.. ప్రతీ చోట బలగాలను, ఆయుధాలను సూపర్ స్ట్రాంగ్ చేయడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. రక్షణ రంగ కేటాయింపులు భారీగా పెంచింది. అత్యాధునిక టెక్నాలజీని మిలటరీకి అందించే ప్రయత్నాలు చేస్తోంది. ఆర్మీ స్ట్రాంగ్ అని విర్రవీగుతున్న చైనాకు పంచ్ ఇచ్చేలా.. భారత్ సూపర్ స్ట్రాంగ్ గా ఎదుగుతోంది. ఇంతకీ రక్షణ రంగంలో మన బలం ఎంత?

రక్షణ రంగ బలోపేతంపై భారత్ దృష్టి సారించింది. సాయుధ దళాలకు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, సైబర్ వార్ ఫేర్, నావికా దళం, నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది.

పూర్తి వివరాలు..

Also Read : దటీజ్ పవన్ కల్యాణ్..! ఢిల్లీ నుంచి గల్లీ వరకు సేనాని దూకుడు, దేశం కళ్లన్నీ పవన్ వైపే..!