Trump Socia Media : ట్రంప్ సోషల్ మీడియా యాప్ లాంఛింగ్ ఆ రోజే!
గతేడాది జనవరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జరిగిన క్యాపిటల్ భవనం హింసాత్మక ఘటన తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రముఖ సామాజిక

Trump
Trump Socia Media : గతేడాది జనవరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జరిగిన క్యాపిటల్ భవనం హింసాత్మక ఘటన తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రముఖ సామాజిక మాధ్యమాలన్నీ ముకుమ్మడిగా బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ట్రంప్ ఆ సయమంలో సొంతంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకువస్తానని ప్రకటించారు. అన్నట్టుగానే గతేడాది అక్టోబర్‌లో సొంత సామాజిక మాధ్యమ వేదికను ప్రకటించారు.
‘ట్రూత్ సోషల్’ పేరుతో సోషల్ మీడియా యాప్‌ను తీసుకొస్తున్నట్టు తెలిపారు. తాజాగా ఈ యాప్ లాంచింగ్ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 21న ఈ యాప్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ది ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) ఆధ్వర్యంలో ‘ట్రూత్ సోషల్ యాప్’ వస్తోంది. ట్విటర్‌ను పోలి ఉండే ఈ యాప్‌లోనూ ఒకరినొకరు ఫాలో చేయొచ్చు. ట్రెండింగ్‌లో ఉన్న విషయాలు తెలుసుకోవచ్చు.
ఈ యాప్‌కి సంబంధించిన నమూనా ఫొటోలు ఇప్పటికే బయటికొచ్చాయి. సాధారణంగా ట్విటర్‌లో పోస్ట్ చేసేవాటిని ట్వీట్ అంటాం. అదేవిధంగా, ట్రూత్ సోషల్ మీడియా యాప్ లో మాత్రం ‘ట్రూత్’ అని సంబోధిస్తారు. తాను తీసుకువస్తున్న ఈ సామాజిక మాధ్యమ వేదిక టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ట్విటర్, ఫేస్‌బుక్‌లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ యాప్ యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇక, యూట్యూబ్ తరహాలో మరో వేదికను కూడా ట్రంప్ తీసుకురానున్నారు. అది కుదరని పక్షంలో టీఎంటీజీ ఆధ్వర్యంలో పాడ్‌కాస్ట్ నెట్‌వర్క్‌నైనా తీసుకురానున్నారని సమాచారం.
ALSO READ Corona Cases : ఢిల్లీలో పెరుగుతున్న పాజిటివిటీ రేటు.. 24 గంటల్లో ఎన్ని కేసులంటే!