పాక్ కు బుద్ధి చెప్పాల్సిందే : ఐరాస వద్ద నిరసల హోరు

పుల్వామా దాడి అనంతరం పాకిస్థాన్ కు వ్యతిరేకంగా..ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత తీవ్రమవుతోంది. ఈ క్రమంలో న్యూయార్క్ లోని  ఐక్యరాజ్య సమితి కార్యాలయం వద్ద పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి.

  • Published By: veegamteam ,Published On : March 4, 2019 / 05:17 AM IST
పాక్ కు బుద్ధి చెప్పాల్సిందే : ఐరాస వద్ద నిరసల హోరు

పుల్వామా దాడి అనంతరం పాకిస్థాన్ కు వ్యతిరేకంగా..ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత తీవ్రమవుతోంది. ఈ క్రమంలో న్యూయార్క్ లోని  ఐక్యరాజ్య సమితి కార్యాలయం వద్ద పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి.

న్యూయార్క్‌ : పుల్వామా దాడి అనంతరం పాకిస్థాన్ కు వ్యతిరేకంగా..ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత తీవ్రమవుతోంది. ఈ క్రమంలో న్యూయార్క్ లోని  ఐక్యరాజ్య సమితి కార్యాలయం వద్ద పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. పలు దేశాలకు చెందిన ప్రజలందరూ కలిసి భారత్, ఆఫ్ఘనిస్థాన్‌లలో పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తు..ప్లకార్డులను ప్రదర్శిస్తు పాక్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. 
Also Read : అభినందన్ అరుదైన రికార్డ్ : F-16 కూల్చిన తొలి IAF కమాండర్

ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జరిగిన ఆత్మాహుతి దాడితోపాటు 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడికి పాకిస్థాన్‌దే బాధ్యత అని ఐరాస ప్రకటించాలని తమ నిరసనలో భాగంగా డిమాండ్ చేశారు. ఈ నిరసనలో అమెరికా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికన్ రిచర్డ్ బెంకిన్ మాట్లాడుతూ..పాకిస్థాన్ దశాబ్దాలుగా భారత్‌లో ఉగ్రదాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. 

శక్తిమంతమైన దేశంగా అవతరిస్తున్నా  భారత్ ఈ ఉగ్రదాడులను ఉపేక్షించదనీ..చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. ఇటువంటి దాడులను అందరు వ్యతిరేకించాలని..భారత్‌కు అండగా  నిలవాల్సిన అవసరం ఉందని వారు కోరారు. ఉగ్రవాదానికి  మద్దతిస్తున్న పాకిస్థాన్ ఆటలు ఇక ఎంతమాత్రమూ సాగవన్న విషయం పాక్ కు  తెలిసేలా చేయాలన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో పాక్ చేస్తున్న అరాచకపు కార్యక్రమాకలు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యుత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందనీ..మరెన్నో మరణాలు సంభవిస్తాయని బెంకిన్ హెచ్చరించారు.
Also Read : భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్‌ ఆర్మీ కాల్పులు

యూఎన్ వో కార్యాలయం ఎదుట పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా  నిర్వహించిన ఆందోళనలో 26/11 ముంబై దాడులు, పుల్వామా ఆత్మాహుతి దాడి, ఉరి సైనిక స్థావరంపై ఉగ్రదాడి, 2001లో పార్లమెంటుపై జరిగిన దాడి, 9/11లో అమెరికాలోని ట్విన్ టవర్స్‌పై జరిగిన ఉగ్రదాడి, కాబూల్, అమెరికా రాయబార కార్యాలయాలపై జరిగిన దాడులు, లండన్ బస్సు దాడి, జర్మనీ రాయబార కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శించారు.

అంతేకాదు, పాకిస్థాన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని, పాకిస్థాన్ ఆర్మీ జనరల్స్, ఐఎస్ఐపై ఆంక్షలు విధించాలని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారి ఆస్తులను ఫ్రీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరెస్‌కు మెమొరాండాన్ని మెయిల్ చేశారు.
Also Read : అభినందన్ దేశభక్తి : డిశ్చార్జ్ చేయండి.. విధుల్లో చేరాలి