Abu Dhabi : బ్రేకింగ్ న్యూస్..అబుదాబి ఎయిర్ పోర్టు సమీపంలో ఉగ్రదాడి
అబుదాబి ఎయిర్ పోర్టులో మూడు ఇంధన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడినట్లు సమాచారం. రెండు ఆయిల్ ట్యాంకర్లలో మంటలు సంభవించాయని...

Abu Dhabi
Drone Attack At Abu Dhabi : అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉగ్రవాదులు దాడి జరిపారు. ప్రత్యక్షంగా కాకుండా..డ్రోన్లతో దాడులు జరిపారు. పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన ముస్సాఫాలో మూడు డ్రోన్లతో యెమెన్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అబుదాబిలో రెండు అగ్నిప్రమాదాలు జరిగాయని తొలుత అధికారులు గుర్తించారు. తర్వాత..తామే ఈ దాడికి పాల్పడినట్లు…Yemen’s Iran-aligned Houthi movement ప్రకటించినట్లు తెలుస్తోంది. మూడు ఇంధన ట్యాంకులు పేలిపోయాయని పోలీసులు తెలిపారు.
Read More : New Moon : మన సౌర కుటుంబం పక్కనే మరో చంద్రుడు..భూమికంటే మూడు రెట్లు పెద్దగా
అబుదాబి ఎయిర్ పోర్టు కు సమీపంలో ఉన్న మూడు ఇంధన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడినట్లు సమాచారం. రెండు ఆయిల్ ట్యాంకర్లలో మంటలు సంభవించాయని, కొత్త విమనాశ్రయ నిర్మాణ స్థలంలో మంటలు చెలరేగాయని అబుదాబి పోలీసులు వెల్లడించారు. 2019, సెప్టెంబర్ 14వ తేదీ సౌదీ అరేబియాలో రెండు కీలక చమురు స్థావరాలపై యెమెన్ కు చెందిన హౌతి తిరుగుబాటు దారులు ఇలాంటి రెండు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల ఫలితంగా…ఫర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు అధికమయ్యాయి. తాజాగా జరిగిన దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలవాల్సి ఉంది.