Expo 2020 : దుబాయ్ ఎక్స్‌పో నిర్మాణంలో ముగ్గురు మృతి, 70 మందికి గాయాలు

వరల్డ్స్ ఫెయిర్ కోసం దుబాయ్ చేస్తున్న నిర్మాణ పనుల్లో 3 కార్మికులు మృతి చెందారని, 70 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని అక్కడి అధికారులు తెలిపారు.

Expo 2020 : దుబాయ్ ఎక్స్‌పో నిర్మాణంలో ముగ్గురు మృతి, 70 మందికి గాయాలు

Expo 2020

Updated On : October 3, 2021 / 3:02 PM IST

Expo 2020 : వరల్డ్స్ ఫెయిర్ కోసం దుబాయ్ చేస్తున్న నిర్మాణ పనుల్లో 3 కార్మికులు మృతి చెందారని, 70 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని అక్కడి అధికారులు తెలిపారు. కార్మికుల భద్రత విషయంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటిస్తున్నామని తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మానవ హక్కుల రికార్డు, వలసకార్మికుల పట్ల అమానవీయ పద్దతులను విమర్శిస్తూ వరల్డ్స్ ఫెయిర్ ను ఆరు నెలల పాటు బహిష్కరించాలని యూరోపియన్ పార్లమెంట్ పిలుపునించింది.

Read More : Mamata Banerjee: బంపర్ మెజారిటీతో గెలిచేసిన మమతా బెనర్జీ

ఇది జరిగిన కొద్దీ రోజుల్లోనే ఈ గణాంకాలు వెల్లడయ్యాయి. తాము ఎవరిని హింసించడం లేదని, పని కల్పిస్తున్నామని అధికారులు వెల్లడించారు. దుబాయ్ ఎక్స్‌పో కోసం 2 లక్షల మంది కూలీలు.. 24.7 కోట్ల గంటలు పనిచేశారని తెలిపారు. “ఎక్స్‌పో 2020 దుబాయ్‌లో పాల్గొనే ప్రతిఒక్కరి ఆరోగ్యం, భద్రత, శ్రేయస్సును రక్షించే విధంగా ప్రపంచ స్థాయి విధానాలు, ప్రమాణాలు, ప్రక్రియలను ఏర్పాటు ప్రకటించారు. కాగా ఈ ఎక్స్‌పోలో ప్రపంచలోని అనేక దేశాలు పాల్గొంటాయి. ఆయా దేశాలు తమ కొత్తగా తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలో ఉంచుతాయి.

Read More : Nara Lokesh: మెగా హీరో సినిమాపై నారా లోకేష్ ప్రశంసలు.. తప్పకుండా చూస్తానంటూ ట్వీట్!