Elephant Breaks Wall: ఆహారం కోసం గోడ పగలగొట్టి కిచెన్ లోకి వెళ్లిన ఏనుగు

Elephant Breaks Wall: ఆహారం కోసం గోడ పగలగొట్టి కిచెన్ లోకి వెళ్లిన ఏనుగు

Elephant Breaks Wall

Updated On : June 22, 2021 / 1:25 PM IST

Elephant Breaks Wall: ఆకలి మనిషిచేతనే కాదు జంతువుల చేత కూడా తప్పులు చేయిస్తుంది. తాజాగా ఓ ఏనుగు ఆకలి తీర్చుకోడానికి దొంగతనం చేసింది. ఏనుగు దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. థాయిలాండ్ లో ఆకలితో ఉన్న ఓ ఏనుగు రాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లోకి ఎంటరైంది.

కిచెన్ గోడను పగలగొట్టి తొండం ద్వారా కవర్లో ఉన్న బియ్యం తీసుకోని ఆరగించింది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో శబ్దం రావడంతో ఇంటి యజమాని అతడి భార్య లేచి చూసేసరికి ఏనుగు కనిపించింది. బియ్యం తింటున్న ఏనుగును చూసి షాక్ కి గురయ్యారు. అతి కష్టం మీద దానిని బయటకు పంపారు.

అయితే ఏనుగు ఇంట్లో వస్తువులను నాశనం చెయ్యలేదు.. గోడను మాత్రం కూల్చింది. ఇక ఈ విషయంపై దంపతులు మాట్లాడారు.. చాల కష్టపడి గోడపెట్టాం ఏనుగు దానిని కూల్చేసింది.. ఇప్పుడు గోడ పెట్టాలి అంటే చాలా ఖర్చు అవుతుంది.. గోడ పెట్టినా మళ్లీ అది కూల్చదనే నమ్మకమైతే లేదని వాపోయారు. ఇక ఈ దృశ్యాలను దంపతులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.