Elon Musk: పబ్లిక్ డిబేట్‌కు రమ్మని ఛాలెంజ్ విసిరిన ఎలన్ మస్క్
ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు ఎలన్ మస్క్ మరోసారి ఛాలెంజ్ విసిరారు. ట్విట్టర్ ప్లాట్ ఫాంపై ఉన్న ఫేక్ అకౌంట్ల గురించి పబ్లిక్ డిబేట్ కు రమ్మని పిలిచారు. ఈ సోషల్ మీడియా అకౌంట్లో స్పామ్ బోట్స్ లాంటి అకౌంట్స్ చాలా ఉన్నాయని.. టెస్లా సీఈఓ పేర్కొన్నారు. ముందుగా ట్విటర్ ను కొనుగోలు చేసేందుకు 44 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసిన మస్క్.. ఓ అభిమాని ట్వీట్ కు రెస్పాండ్ అయ్యారు.

Elon Musk Sent Warning Message To Twitter Ceo Parag Agrawal, Said Stop Creating Trouble
Elon Musk: ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు ఎలన్ మస్క్ మరోసారి ఛాలెంజ్ విసిరారు. ట్విట్టర్ ప్లాట్ ఫాంపై ఉన్న ఫేక్ అకౌంట్ల గురించి పబ్లిక్ డిబేట్ కు రమ్మని పిలిచారు. ఈ సోషల్ మీడియా అకౌంట్లో స్పామ్ బోట్స్ లాంటి అకౌంట్స్ చాలా ఉన్నాయని.. టెస్లా సీఈఓ పేర్కొన్నారు.
ముందుగా ట్విటర్ ను కొనుగోలు చేసేందుకు 44 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసిన మస్క్.. ఓ అభిమాని వివరణ అడగ్గా ఆ ట్వీట్ కు రెస్పాండ్ అయ్యారు.
“డేటా అనలిస్ట్”, “స్పేస్‌ఎక్స్ ఫ్యాన్”, ఆండ్రియా స్ట్రోప్ప చేసిన ట్వీట్, స్పామ్.. నకిలీ ఖాతాల గురించి మస్క్ మరింత సమాచారాన్ని అడిగినప్పుడు ట్విట్టర్ “అస్పష్టమైన డేటా” అందించిందని ఎత్తి చూపారు. ట్విటర్ “పాత డేటాను అందించింది. నకిలీ డేటా సెట్” కూడా అని స్ట్రోప్పా పేర్కొన్నారు.
Read Also: సెర్గీ బ్రిన్ భార్యతో ఎఫైర్ రూమర్లకు ఎలన్ మస్క్ ఘాటు రిప్లై
మస్క్ ట్వీట్‌లకు ప్రశంసలతో సమాధానమిస్తూ.. “ట్విటర్ బాట్ శాతం గురించి బహిరంగ చర్చకు పరాగ్ అగర్వాల్‌కు ఛాలెంజ్ విసురుతున్నా. ట్విట్టర్ బాట్ శాతం గురించి ప్రజలకు నిరూపించనివ్వండి. మస్క్ అదే రోజు నకిలీ ఖాతాల గురించి పోల్ నిర్వహించాడు.
8లక్షల మంది వినియోగదారులు పోల్ లో పాల్గొనగా 64.9 శాతం మంది ట్విట్టర్ కు వ్యతిరేకంగా ఓటేశారు.