Blue Tick: ట్విట్టర్ బ్లూటిక్ మీద యూటర్న్ తీసుకున్న ఎలాన్ మస్క్.. అంతమంది ఫాలోవర్లు ఉంటే ఫ్రీ బ్లూ టిక్
బ్లూటిక్ కోసం డబ్బులు చెల్లించినట్లు శనివారం అమితాబ్ బచ్చన్ ప్రకటించారు. ఇలా కొంత మంది బ్లూటిక్ తీసుకున్నారు. అయితే మిగిలిన వారిలో ఎంతమంది సబ్స్క్రిప్షన్ చేసుకున్నారనే విషయంపై స్పష్టత లేదు. అయితే ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు అయిన జాక్ డోర్సేకు 6.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఖాతాకు బ్లూటిక్ లేకపోవడం గమనార్హం.

Elon Musk
Blue Tick: బ్లూటిక్ మీద ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ యూటర్న్ తీసుకున్నారు. ముందుగా లెగసీ బ్లూటిక్ తొలగించనున్నట్లు ప్రకటించినట్టుగానే మూడు రోజుల క్రితం.. అందరి బ్లూటిక్ రద్దు చేశారు. ఎవరైనా 8 డాలర్లు చెల్లిస్తేనే బ్లూటిక్ ఇస్తామని ప్రకటించారు. వాస్తవానికి మస్క్ ఊహించిన దానికి రివర్సైంది. బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ పట్ల సెలెబ్రిటీలు అంత ఆసక్తి చూపలేదు. పైగా వెరిఫికేషన్ లేకపోవడంతో ట్విట్టర్ పట్ల వారు ఆసక్తి చూపకపోవచ్చనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సెలెబ్రిటీ అకౌంట్లకు బ్లూటిక్ పునరుద్ధరించారు. అయితే ఒక మిలియన్ ఫాలోవర్లు ఉన్న అకౌంట్లకే ఈ సదుపాయాన్ని కల్పించారు.
Maharashtra: షిండే ప్రభుత్వాన్ని ఉద్ధవ్ సేన డెత్ వారెంట్.. 15 రోజుల్లో కూలిపోతుందంటూ స్టేట్మెంట్
ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో సహా షారూఖ్ ఖాన్, రాహుల్ గాంధీ, అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ లాంటి వారంతా బ్లూటిక్ వెరిఫికేషన్ కోల్పోయారు. అయితే వీళ్లందరికీ తాజాగా బ్లూటిక్ ఇచ్చారు. కాగా, బ్లూటిక్ కోసం డబ్బులు చెల్లించినట్లు శనివారం అమితాబ్ బచ్చన్ ప్రకటించారు. ఇలా కొంత మంది బ్లూటిక్ తీసుకున్నారు. అయితే మిగిలిన వారిలో ఎంతమంది సబ్స్క్రిప్షన్ చేసుకున్నారనే విషయంపై స్పష్టత లేదు. అయితే ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు అయిన జాక్ డోర్సేకు 6.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఖాతాకు బ్లూటిక్ వెరిఫికేషన్ రాకపోవడం గమనార్హం.
Tamil Nadu: తమిళనాడులో 12 గంటల పని విధానంపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత
దీనికి ముందు కొంతమందికి తాను వ్యక్తిగతంగా బ్లూటిక్ కోసం డబ్బులు చెల్లిస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. కానీ ప్రస్తుతం మిలియన్ మార్కుతో అందరికీ బ్లూటిక్ ఇచ్చారు. అయితే మస్క్ చేయాలనుకున్న ప్రయోగం విఫలం కావడంతో ఇలా యూటర్న్ తీసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మిగతా సోషల్ మీడియాలో కంటే ట్విట్టర్ లో తక్కువ ప్రకటనలు ఉంటాయి. అయితే సబ్స్క్రిప్షన్ ద్వారా డబ్బులు సంపాదించాలని భావించిన మస్క్ కు భంగపాటు ఎదురైంది. అందుకే ఈ కొత్త నిర్ణయం తప్పలేదని అంటున్నారు.