Elon Musk Twitter: ఈపాటికి చచ్చిపోవాల్సింది కదా..? విమర్శకులకు ఎలాన్ మస్క్ స్ట్రాంగ్ కౌంటర్..
నవంబర్ 29న ట్విట్టర్ బ్లూ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ను అందుబాటులోకి తెస్తామని మస్క్ గత వారంక్రితం చెప్పాడు. తాజాగా ఆ సేవలను అందుబాటులోకి తేవడం ఇప్పట్లో కుదరదని, ట్విటర్ బ్లూ ప్రక్రియతో ఎలాంటి అవకతవకలు జరగవని, ప్రజలు అందరికీ పూర్తినమ్మకం వచ్చిన తరువాతనే రీ లాంచ్ చేస్తానని ప్రకటించారు.

Elon Musk
Elon Musk Twitter: బిగ్గెస్ట్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తరువాత కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ట్విటర్ నష్టాల బాటలో నడుస్తుందని పేర్కొంటుూ సంస్థలో పనిచేసే 50శాతం మంది ఉద్యోగులపై మస్క్ వేటువేశారు. అంతేకాదు.. మరో 4వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనుసైతం తొలగించి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు మస్క్.
Elon Musk: ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ముగిసింది.. కొత్తవారి నియామకానికి సిద్ధంగా ఉన్నాం..
ట్విటర్‌లో బ్లూటిక్ సేవలకు వినియోగదారులు నెలకు 8 డాలర్లు చెల్లించాలని మస్క్ ప్రకటించాడు. గతంలో సినీ, రాజకీయ ప్రముఖులు, సెలబ్రెటీలు, ప్రముఖ వ్యక్తులకు మాత్రమే బ్లూటిక్ సేవలు అందుబాటులో ఉండేది. కానీ, మస్క్ ట్విటర్ ను టేకోవర్ చేసిన తరువాత ప్రతీఒక్కరికి బ్లూటిక్ సేవలను అందుబాటులోకి తెచ్చాడు.. బ్లూటిక్ సేవలు పొందిన ప్రతీఒక్కరూ నెలకు 8డాలర్లు చెల్లించాలని నిబంధన పెట్టారు. దీంతో నకిలీ ఖాతాల బెడద ఎక్కువకావడం, తీవ్ర విమర్శలు రావడంతో మస్క్.. బ్లూ టిక్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాడు.
Wasn’t Twitter supposed to die by now or something … ?
— Elon Musk (@elonmusk) November 23, 2022
నవంబర్ 29న ట్విట్టర్ బ్లూ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ను అందుబాటులోకి తెస్తామని మస్క్ గత వారంక్రితం చెప్పాడు. తాజాగా ఆ సేవలను అందుబాటులోకి తేవడం ఇప్పట్లో కుదరదని, ట్విటర్ బ్లూ ప్రక్రియతో ఎలాంటి అవకతవకలు జరగవని, ప్రజలు అందరికీ పూర్తినమ్మకం వచ్చిన తరువాతనే రీ లాంచ్ చేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో మస్క్ పై విమర్శలు, సెటైర్లతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మస్క్ ప్రధాన ఆదాయం నెలకు 8డాలర్ల ప్రణాళిక తాత్కాలికంగా నిలిపివేశాడు, మరి ట్విటర్ ఇప్పుడు ఎలా నడుస్తుందో, చచ్చిపోయినట్లేనా అంటూ నెటిజన్లు సెటైర్లు గుప్పించారు. వీటికి స్పందించిన మస్క్.. ట్విటర్ ఈపాటికి చచ్చిపోవాల్సిది కదా? అంటూ వ్యంగ్యంగా విమర్శకులను ఉద్దేశించి ట్వీట్ చేశాడు.