Elon Musk: ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ముగిసింది.. కొత్తవారి నియామకానికి సిద్ధంగా ఉన్నాం..

ట్విటర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ సోమవారం ఉధ్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్విటర్ నుంచి తొలగింపుల ప్రక్రియ పూర్తయిందని, ఇక ఇంజనీరింగ్, సేల్స్ విభాగాల్లో చురుకైన వ్యక్తులను రిక్రూట్ చేసేందుకు చర్యలుచేపడుతున్నట్లు మస్క్ అన్నారు. అయితే, ప్రతిభావంతులు ఎవరైనా ఉంటే రిఫర్ చేయొచ్చని మస్క్ ఉద్యోగులకు సూచించినట్లు ‘ది వెర్జ్’ నివేదించింది.

Elon Musk: ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ముగిసింది.. కొత్తవారి నియామకానికి సిద్ధంగా ఉన్నాం..

Twitter

Elon Musk: మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ ట్విటర్‌ను బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ హస్తగతం చేసుకున్న నాటినుండి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ట్విటర్ ను టేకోవర్ చేసుకున్న కొద్దిరోజుల్లోనే మస్క్ సంస్థలోని 50శాతం మంది ఉద్యోగులను తొలగించారు. ఆ తరువాత మరో 4వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. సంస్థ నష్టాలను భర్తీ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ తెలిపాడు. అయితే, మూడు వారాల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను పూర్తిచేసిన మస్క్.. ప్రస్తుతం కొత్తవారిని తీసుకొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Elon Musk: ఎలాన్ మస్క్ మాట్లాడుతుండగా.. మీటింగ్ నుంచి వెళ్లిపోయిన ట్విట్టర్ ఉద్యోగులు

ఇటీవల ఉద్యోగులతో జరిగిన సమావేశంలో మస్క్ కీలక వ్యాఖ్యలుచేశారు. ఇక ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ముగిసిందని, ఇంజినీరింగ్, సేల్స్‌ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నిర్ణయించినట్లు ‘ది వెర్జ్’ నివేదించింది. ప్రతిభకలిగిన వారిని సిఫారసు చేయవచ్చునని ఉద్యోగులకు మస్క్ సూచించినట్లు తెలిపింది. మరోవైపు.. మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌కు ప్రస్తుతం దాని వెబ్‌సైట్‌లో ఎలాంటి ఓపెన్ పొజిషన్‌లు లేవు, కంపెనీ కోరుతున్న నిర్దిష్ట ఇంజనీరింగ్, సేల్స్ పోస్ట్‌లను మస్క్ పేర్కొనలేదు. క్లిష్టమైన నియామకాల పరంగా.. సాఫ్ట్‌వేర్‌లో అనుభవం కలిగిన వ్యక్తులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తానని మస్క్ పేర్కొన్నట్లు నివేదిక పేర్కొంది.

Twitter BluTick: బ్లూటిక్‌పై మస్క్ కీలక ప్రకటన.. అవితేలే వరకు పున:ప్రారంభం ఉండదని వెల్లడి..

ఇదిలాఉంటే.. ట్విటర్ టెక్సాస్, కాలిఫోర్నియాలో రెండు కార్యాలయాలు కలిగి ఉంది. టెస్లాలో చేసినట్లుగా టెక్సాస్‌లోనే కంపెనీ ప్రధానకార్యాలయాన్ని కలిగి ఉండటానికి ఎలాంటి ప్రణాళికలు లేవని మస్క్ తెలిపాడు.