Heavy Rains : నీటమునిగిన న్యూయార్క్ నగరం..ఎమర్జెన్సీ ప్రకటన

కురుస్తున్న భారీవర్షాలతో అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరం నీట మునిగింది. 8.5 మిలియన్ల మంది జనం ఉన్న న్యూయార్క్ నగరం వరదల్లో చిక్కుకోవడంతో న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ అధికారికంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.....

Heavy Rains : నీటమునిగిన న్యూయార్క్ నగరం..ఎమర్జెన్సీ ప్రకటన

New York City Flooded

Heavy Rains : కురుస్తున్న భారీవర్షాలతో అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరం నీట మునిగింది. 8.5 మిలియన్ల మంది జనం ఉన్న న్యూయార్క్ నగరం వరదల్లో చిక్కుకోవడంతో న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ అధికారికంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. (Emergency Declared In New York) నగర వీధుల్లో వరదనీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ కోరారు.

Congress Manifesto : వారందరికీ ఉచిత ఇంటర్ నెట్ సౌకర్యం.. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కీలక నిర్ణయం

‘‘మీరు ఇంట్లో ఉంటే, ఇంట్లోనే ఉండండి. మీరు కార్యాలయంలో లేదా పాఠశాలలో ఉంటే, ప్రస్తుతానికి ఆశ్రయం ఉంటే అక్కడే ఉండండి, సబ్‌వేలు కొన్ని వరదనీటితో నిండి ఉన్నాయి,నగరంలో తిరగడం చాలా కష్టం’’ అని మేయర్ పేర్కొన్నారు. (New York As City Flooded) ఈశాన్య యునైటెడ్ స్టేట్స్‌లో రాత్రిపూట కురిసిన భారీ వర్షాలకు న్యూయార్క్‌లోని పలు ప్రాంతాలు శనివారం వరద నీటిలో మునిగిపోయాయి. (Heavy Rains) అమెరికా ఆర్థిక రాజధానిలోని సబ్‌వేలు, విమానాశ్రయాలు పాక్షికంగా స్తంభించాయి.

ఫేస్‌బుక్‌లో వాట్సాప్‌ స్టేటస్‌ షేరింగ్..!

లాగౌర్డియా విమానాశ్రయంలోని ఒక టెర్మినల్ ను మూసివేశారు. న్యూయార్క్ నగరంలో కార్లు వరదనీటిలో మునిగిపోయాయి. భారీ వరదలతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పలు దుకాణాలు నీట మునిగాయి. న్యూయార్క్ సబ్‌వే వ్యవస్థ కూడా దెబ్బతింది. నగరంలో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని నేషనల్ వెదర్ సర్వీసు తెలిపింది.

Rakul Preet Singh : తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న రకుల్ ప్రీత్.. టీనేజ్‌లో ముంబైకి వెళ్లి..

మధ్య అట్లాంటిక్ తీరం వెంబడి ఉన్న అల్పపీడన వ్యవస్థ వల్ల వర్షం కురిసింది. 2021వ సంవత్సరంలో ఇడా హరికేన్ వల్ల వరదలు సంభవించడంతో 13 మంది మరణించారు. వరదల కారణంగా బ్రూక్లిన్‌తో సహా అనేక లైన్‌లు మూసివేశారు.