Fake Pakistan Football Team: ఎంతకు తెగించార్రా..! పాకిస్తాన్ ఫేక్ ఫుట్‌బాల్ జట్టు.. అక్రమంగా ఆ దేశంలోకి ఎంట్రీ..

22మంది సభ్యుల నకిలీ ఫుట్‌బాల్ జట్టును జపాన్‌కు పంపడంలో మానవ అక్రమ రవాణ నెట్‌వర్క్ ప్రమేయం ఉందని FIA ఒక ప్రకటనలో తెలిపింది.

Fake Pakistan Football Team: ఎంతకు తెగించార్రా..! పాకిస్తాన్ ఫేక్ ఫుట్‌బాల్ జట్టు.. అక్రమంగా ఆ దేశంలోకి ఎంట్రీ..

Updated On : September 17, 2025 / 9:45 PM IST

Fake Pakistan Football Team: పాకిస్తాన్ కు చెందిన కొందరు వ్యక్తులు తెగించారు. ఫుట్‌బాల్ ఆటగాళ్లమంటూ ఏకంగా జపాన్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన జపాన్ ఇమిగ్రేషన్ అధికారులు అలర్ట్ అయ్యారు. తమ దేశంలోకి అక్రమంగా వచ్చిన ఫేక్ ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చి మరీ వెనక్కి పంపేశారు. ఆ తర్వాత ఈ విషయాన్ని పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి వారు తెలియజేశారు.

మాలిక్ వకాస్ అనే వ్యక్తి ఫేక్ ఫుట్‌బాల్ జట్టును సృష్టించాడు. ఆ ముసుగులో 22 మందిని జపాన్‌కు పంపాడు. ఈ విషయాన్ని పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైతం నిర్ధారించింది. వకాస్‌ను అరెస్ట్ చేసి విచారించగా 2024లోనూ ఇదే పద్ధతిలో అతడు పలువురు వ్యక్తులను అక్రమంగా జపాన్ పంపినట్లు బయటపడింది.

22మంది సభ్యుల నకిలీ ఫుట్‌బాల్ జట్టును జపాన్‌కు పంపడంలో మానవ అక్రమ రవాణ నెట్‌వర్క్ ప్రమేయం ఉందని FIA ఒక ప్రకటనలో తెలిపింది. నకిలీ ఆటగాళ్లు ఫుట్‌బాల్ కిట్‌లు ధరించారు. పాకిస్తాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. వారు జపాన్ క్లబ్‌తో మ్యాచ్‌లను షెడ్యూల్ కూడా చేశారు.

22 మంది సభ్యుల నకిలీ ఫుట్‌బాల్ జట్టు జూన్ 2025లో జపాన్ చేరుకుంది. వీరు 15 రోజుల వీసా పొందారు. వాళ్లు ఫేక్ అని గుర్తించిన జపాన్ ఇమిగ్రేషన్ అధికారులు ఎయిర్ పోర్ట్ నుండి వెనక్కి పంపేశారు. అనంతరం ఈ విషయాన్ని FIAకి నివేదించారు.

ఈ విషయంపై FIA దర్యాప్తు ప్రారంభించింది. ఈ సంఘటనలో పాల్గొన్న మానవ అక్రమ రవాణా ముఠా సభ్యుడు, ప్రధాన అనుమానితుడు వకాస్ అలీని అరెస్ట్ చేసింది. దర్యాప్తులో సంచలన విషయాలు తెలిశాయి. నిందితుడు వకాస్ తన నెట్‌వర్క్ ద్వారా 2024లో 17 మందిని జపాన్‌కు పంపాడు. వారిని పాకిస్తాన్ ఫుట్‌బాల్ జట్టు సభ్యులుగా చూపించాడు. వారు తిరిగి వెనక్కి రాలేదు.

ఫేక్ జట్టుని జపాన్ కి పంపేందుకు నిందితడు వకాస్ పెద్ద ప్లానే శాడు. నకిలీ లేఖలు సృష్టించాడు. పాకిస్తాన్ ఫుట్‌బాల్ సమాఖ్య (PFF), విదేశాంగ మంత్రిత్వ శాఖ NOCని కూడా వాడుకున్నాడు.

జపాన్ వీసా పొందేందుకు నిందితుడు.. ఒక్కొక్కరి నుంచి PKR 4.5 మిలియన్లు వసూలు చేశాడు. నెట్‌వర్క్‌లోని ఇతర సభ్యులను అరెస్ట్ చేయడానికి దాడులు కొనసాగుతున్నాయని ఎఫ్ ఐఏ తెలిపింది.

Also Read: UAEతో మ్యాచ్ బాయ్‌కాట్.. ఇక పాకిస్తాన్ టాటా బైబై ఖతం..