మళ్లీ ఆకలేస్తే.. : బిల్లు కట్టకుండా రెస్టారెంట్ లో కూతురి తాకట్టు
అదో నిట్టమధ్యాహ్నం. రెండేళ్ల కూతురిని భుజాలపై ఎత్తుకుని రోడ్డుపై నడుస్తున్నాడు. బాగా ఆకలివేస్తోంది. అటు ఇటు చూశాడు. దగ్గరలో ఓ రెస్టారెంట్ కనిపించింది. వెంటనే అందులోకి వెళ్లిపోయాడు. కావాల్సింది ఆర్డర్ చేశాడు.

అదో నిట్టమధ్యాహ్నం. రెండేళ్ల కూతురిని భుజాలపై ఎత్తుకుని రోడ్డుపై నడుస్తున్నాడు. బాగా ఆకలివేస్తోంది. అటు ఇటు చూశాడు. దగ్గరలో ఓ రెస్టారెంట్ కనిపించింది. వెంటనే అందులోకి వెళ్లిపోయాడు. కావాల్సింది ఆర్డర్ చేశాడు.
అదో నిట్టమధ్యాహ్నం. రెండేళ్ల కూతురిని భుజాలపై ఎత్తుకుని రోడ్డుపై నడుస్తున్నాడో తండ్రి. బాగా ఆకలివేస్తోంది. అటు ఇటు చూశాడు. దగ్గరలో ఓ రెస్టారెంట్ కనిపించింది. వెంటనే అందులోకి వెళ్లిపోయాడు. కావాల్సింది ఆర్డర్ చేశాడు. కడుపునిండా భుజించాడు. కూతురికి కొంచెం పెట్టాడు. రెస్టారెంట్ సిబ్బంది బిల్లు ఇచ్చారు. జేబు చూస్తే అంత డబ్బు లేదు. బిల్లు ఎలా కట్టాలా అని ఆలోచనలో పడ్డాడు. ఇలాంటి సీన్లను సినిమాల్లో చాలా చూసే ఉంటాం. సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురైంది చైనాకు చెందిన వ్యక్తికి. చివరికి తన జేబులో ఉన్న చిల్లర మొత్తాన్ని రెస్టారెంట్ యజమానికి ఇచ్చాడు. బిల్లు అయింది.. మొత్తం రూ.62. అందులో రూ.10 తక్కువ అయింది. తన దగ్గర లేవని ఇంటికి వెళ్లి తీసుకొస్తానని చెప్పాడు.
అప్పటివరకూ సెక్యూరిటీగా తన రెండేళ్ల కూతుర్ని అక్కడే వదిలి వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి పది రూపాయలు ఇచ్చి తన కూతుర్ని తీసుకెళ్తానని చెప్పాడు. తండ్రి తనను వదిలేసి వెళ్తుండటంతో అది చూసిన చిన్నారి డాడీ.. డాడీ.. అంటూ ఏడుస్తూ అతని వెంట పరిగెత్తింది. అక్కడే ఆగిన తండ్రి.. ఇప్పుడే వచ్చి తీసుకెళ్తానని నచ్చజెప్పి రెస్టారెంట్ సిబ్బందికి అప్పజెప్పాడు.
మరుసటి రోజు రూ.10 తెస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి ఆచూకీ లేదు. తండ్రి కోసం ఏడుస్తున్న చిన్నారికి రెస్టారెంట్ యజమాని తండ్రి వస్తాడని బుజ్జగించాడు. కిచెన్ పాల డబ్బా తీసుకొచ్చి పాపకు తాగించాడు. తండ్రి జాడ తెలియకపోవడంతో రెస్టారెంట్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు చిన్నారిని పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. మరుసటి రోజు రెస్టారెంట్ కు వచ్చిన తండ్రి.. తన కూతురు లేకపోవడంతో షాక్ అయ్యాడు.
పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారని చెప్పడంతో తండ్రి కూడా అక్కడికి వెళ్లాడు. పోలీసులు అతన్ని మందలించారు. పాపను మరోసారి ఇలా వదిలిపెట్టి వెళితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపారు. రెస్టారెంట్ లో తండ్రి కూతుర్ని వదిలేసి వెళ్తుండగా.. అదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ సీసీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.