Gilda Sportillo : పార్లమెంట్ లో బిడ్డకు పాలు ఇచ్చిన మహిళా ఎంపీ

ఈ ఘటనపై తోటి ఎంపీలు హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టారు. సంప్రదాయంగా పురుషుల ఆధిక్యం ఉన్న ఇటలీలోని దిగువ సభలో ఇలాంటి ఘటన జరుగడం విశేషంగా చెప్పవచ్చు.

Gilda Sportillo : పార్లమెంట్ లో బిడ్డకు పాలు ఇచ్చిన మహిళా ఎంపీ

Gilda Sportillo

Updated On : June 8, 2023 / 1:49 PM IST

Gilda Sportillo breastfed son : ఇటలీ పార్లమెంట్ లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఆ దేశానికి చెందిన మహిళా ఎంపీ గిల్దా స్పోర్టిల్లో ఇటలీ పార్లమెంట్ లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఆ దేశానికి చెందిన మహిళా ఎంపీ గిల్దా స్పోర్టిల్లో తన కుమారుడికి పార్లమెంట్ లో హాల్ లోనే పాలు ఇచ్చింది. సభ్యులు కూర్చునే బెంచ్ దగ్గర కుమారుడిని ఎత్తుకుని చనుబాలు తాగించారు.

ఈ ఘటనపై తోటి ఎంపీలు హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టారు. సంప్రదాయంగా పురుషుల ఆధిక్యం ఉన్న ఇటలీలోని దిగువ సభలో ఇలాంటి ఘటన జరుగడం విశేషంగా చెప్పవచ్చు. ఆరు నెలల వయసున్న ఎంపీ గిల్దా కుమారుడు ఫెడ్రికోకు పార్లమెంట్ లో ఎంపీలు ఆశీస్సులు అందించారు.

Minister KTR : కొత్తకోట, దేవరకద్రలో ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మిస్తాం : మంత్రి కేటీఆర్

సుదీర్ఘమైన, స్వేచ్ఛాయుతమైన, శాంతియుత జీవితాన్ని ఫెడ్రికో పొందాలని కోరుతూ ఆ సభలను నిర్వహిస్తున్న చైర్మన్ జార్జియో మూల్ పేర్కొన్నారు. పాలు తాగే పిల్లలు ఉన్న మహిళ ఎంపీలు తమ పిల్లలను పార్లమెంట్ కు తీసుకరావచ్చని గత నవంబర్ లో ఇటలీ చట్టం చేసింది. ఏడాది వయసు వచ్చే వరకు పిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ చేయవచ్చని తీర్మానం చేశారు.