న్యూజిలాండ్ కాల్పుల్లో ఇండియన్స్ మిస్సింగ్ : నా కొడుకు ఎక్కడ? హైదరాబాదీ తండ్రి ఆవేదన

న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలోని మసీదుల్లో జరిగిన కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మందికి పైగా గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటన అనంతరం భారతీయ సంతతికి చెందిన 9 మంది కనిపించకుండా పోయారు.

  • Published By: sreehari ,Published On : March 16, 2019 / 08:51 AM IST
న్యూజిలాండ్ కాల్పుల్లో ఇండియన్స్ మిస్సింగ్ : నా కొడుకు ఎక్కడ? హైదరాబాదీ తండ్రి ఆవేదన

Updated On : March 16, 2019 / 8:51 AM IST

న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలోని మసీదుల్లో జరిగిన కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మందికి పైగా గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటన అనంతరం భారతీయ సంతతికి చెందిన 9 మంది కనిపించకుండా పోయారు.

న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలోని మసీదుల్లో జరిగిన కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మందికి పైగా గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటన అనంతరం భారతీయ సంతతికి చెందిన 9 మంది కనిపించకుండా పోయారు. అదృశ్యమైన భారతీయులు ఎక్కడికి వెళ్లారు? ప్రాణాలతో ఉన్నారా? లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా? వారు ఏమయ్యారో మిస్టరీగా మారింది.
Read Also : న్యూజిలాండ్ మసీదుల్లో కాల్పులు : 9 మంది ఇండియన్స్ మిస్సింగ్

కనిపించకుండా పోయిన భారతీయుల్లో హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఫర్హజ్ హసాన్ కూడా ఉన్నాడు. హసన్ ఇంకా తిరిగా రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడి ఆచూకీ వెంటనే తెలుసుకోవాల్సిందిగా బాధితుడి తండ్రి మహ్మద్ సయ్యుద్దీన్ ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు.  

‘మసీదులో ప్రార్థన చేసేందుకు నా కుమారుడు కూడా వెళ్లాడు. వెళ్లిన మా వాడు ఇంకా ఇంటికి తిరిగిరాలేదు. 17 మంది అదృశ్యమైనట్టు వార్తలు వస్తున్నాయి. నా కుమారుడు ఎక్కడ ఉన్నాడో ప్రభుత్వం సాధ్యమైనంత తొందరగా గుర్తించాలని కోరుతున్నా’ అని జాతీయ మీడియాతో ఆవేదన చెప్పుకున్నాడు.

న్యూజిలాండ్ మసీదుల్లో జరిగిన కాల్పుల్లో మరో హైదరాబాదీ అహ్మద్ జాంగీర్ కూడా గాయపడ్డాడు. గాయపడ్డ సోదరుడిని కలిసేందుకు తన వీసాను ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలంటూ అహ్మద్ సోదరుడు కుర్షీద్ జాంగీర్ ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. ‘కాల్పులు జరిగినప్పటినుంచి మాకు సరైన సమాచారం లేదు. వీసా త్వరగా వచ్చి న్యూజిలాండ్ వెళ్లేందుకు ప్రభుత్వం నాకు సహకరించాలి. గాయపడ్డ నా సోదరుడిని చూసుకోవాల్సి ఉంది’ అని కుర్షీద్ తెలిపాడు.