Pakistan Floods: పాకిస్థాన్‌లో వరదల బీభత్సం.. ప్రధాని మోదీ ట్వీట్.. సాయమందించేందుకు సిద్ధమవుతున్న భారత్!

పాకిస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఆ దేశంలోని దాదాపు సగానికిపైగా ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. వేలాది మంది మరణించగా, లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. పాక్ లో వరద బీభత్సాన్ని దృష్టిలో ఉంచుకొని సాయం అందించేందుకు భారత్ సిద్ధమైంది.

Pakistan Floods: పాకిస్థాన్‌లో వరదల బీభత్సం.. ప్రధాని మోదీ ట్వీట్.. సాయమందించేందుకు సిద్ధమవుతున్న భారత్!

Pakistan Floods

Updated On : August 30, 2022 / 7:20 AM IST

Pakistan Floods: పాకిస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఆ దేశంలోని దాదాపు సగానికిపైగా ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. జులై నుంచి దేశంలో అసాధారణ రుతుపవన ప్రభావం కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు దేశంలోని 150 జిల్లాల్లో 110 చోట్ల వరదలు వచ్చినట్లు పాక్ నేషల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) తెలిపింది. 2010లో పాకిస్థాన్ చూసిన సూపర్ ఫ్లండ్ కంటే ఇది తీవ్రంగా ఉంది. ప్రస్తుతం వరదల కారణంగా ఇప్పటి వరకు 1061 మంది మరణించారు. 4,52,000 ఇళ్లు దెబ్బతిన్నాయి. మొత్తం 2,18,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో మెరుపు వరదల కారణంగా వేల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. దాదాపు 8లక్షల పశువులు చనిపోగా, 20లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ఎన్‌డీఎంఏ పేర్కొంది.

Pakistani drone: పాకిస్థాన్ డ్రోను జారవిడిచిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం

ఎనిమిది వారాలుగా పాకిస్థాన్ లోని అనేక ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉండటం గమనార్హం. భారీ వర్షాల కారణంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు పేర్కొంటున్నారు. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్ధారీ మాట్లాడుతూ.. చనిపోయిన వారిలో మూడింట ఒకవంతు మంది పిల్లలే ఉన్నారని భావిస్తున్నామని అన్నారు. దేశంలోని ఉత్తర్ స్వాత్ లోయలో భారీ వరదల కారణంగా వంతెనలు, రోడ్లు కోట్టుకుపోయాయి. పాక్ లో వరదల కారణంగా సహాయక చర్యలకోసం యూకే ప్రభుత్వం 1.8 మిలియన్ డాలర్లు ఆర్థిక సాయం అందించింది. ఇదిలా ఉంటే పొరుగుదేశమైన పాక్ వరదలతో అతలాకుతలం అవుతుండటంతో భారత్ సాయం అందించేందుకు సిద్ధమవుతుంది.

Floods in Pakistan: పాకిస్థాన్‌లో వరదల బీభత్సం.. 982 మంది మృతి.. 6.8లక్షల ఇళ్లు ధ్వంసం..

పాకిస్థాన్ లో వరదల బీభత్సాన్ని ఉద్దేశించి భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. పాకిస్థాన్ లో వరదల కారణంగా సంభవించిన విధ్వంసం చూసి బాధపడ్డానని, ఈ ప్రకృతి వైపరిత్యంలో బాధిత కుటుంబాలకు, గాయపడిన వారికి, నష్టపోయిన వారందరికీ మా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నామని అన్నారు. త్వరగా ఆ దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రధాని కోరారు.

వరదలతో అతలాకుతలం అవుతున్న పాకిస్థాన్ కు మానవతా సహాయం అందించే అవకాశంపై అత్యున్నత స్థాయిలో చర్చలు  జరుగుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయితే పాక్ కు సాయం అందించడంపై ఇంకా ఇండియా ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, సాయం అందించేందుకు మోదీ ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రకృతి విపత్తు కారణంగా పాకిస్థాన్ కు భారత్ సాయం చేయడం ఇదే తొలిసారి అవుతుంది. గతంలో అప్పటి యూపీ ప్రభుత్వం హయాంలో 2010లో వరదలకు, 2005లో భూకంపానికి భారత్ పాకిస్థాన్ కు సహాయం చేసింది.