Sherika De Armas : 26ఏళ్లకే చనిపోయిన మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్

మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్ 26 ఏళ్లకే మృతి చెందారు. గర్భాశయ క్యాన్సర్ తో షెరికా చనిపోయారు.

Sherika De Armas : 26ఏళ్లకే చనిపోయిన మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్

Sherika De Armas

Updated On : October 16, 2023 / 10:37 AM IST

Former Miss World Contestant  Sherika De Armas : మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్ 26 ఏళ్లకే మృతి చెందారు. గర్భాశయ క్యాన్సర్ తో షెరికా చనిపోయారు. జరిగిన మిస్ వరల్డ్ పోటీలో ఉరుగ్వేకు నుంచి షెరికా ప్రాతినిధ్యం వహించారు. గర్భాశయ క్యాన్సర్ బారిన పడిన ఆమె వ్యాధితో పోరాడారు. కీయోథెరపీ, రేడియో థెరపీలు చేయించుకున్నారు. అయినా ఫలితం దక్కలేదు. క్యాన్సర్ మహమ్మారితో పోరాడిన షెరికా చిట్టచివరకు అక్టోబర్ (2023) 13న అతి చిన్న వయస్సులోనే ప్రాణాలు వదిలారు. షెరికా మరణాన్ని ఆమె సోదరుడు మేక్ డి అర్మాస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.  2015లో మిస్ ఉరుగ్వే కిరీటాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఆమె మరణం ఉరుగ్వేనే కాదు యావత్ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిం చేసింది. షెరికా మరణం గురించి ఉరుగ్వే మిస్ యూనివర్స్ 2022 కార్లా రొమెరో మాట్లాడుతు..ఈ ప్రపంచం కోసం ఆమె చాలా చేశారు..నా జీవితంలో కలుసుకున్న అత్యంత అందమైన మహిళల్లో షెరికా ఒకరు అంటూ విచారణం వ్యక్తం చేస్తు పేర్కొన్నారు.

అలాగే ఆమె స్నేహితులు తీవ్ర విచారంతో నిన్నెప్పుడు మర్చిపోము నేస్తమా అంటూ కన్నీరు కారుస్తు వెల్లడించారు. మీ ఆప్యాయత నీతో మేము పంచుకున్న ఆనందాలు ఎప్పుడు గుర్తుండిపోతాయి అంటూ సంతాపం వ్యక్తంచేశారు.

చైనాలో నిర్వహించిన 2015 మిస్ వరల్డ్ పోటీల సమయంలో షెరికా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతు..బ్యూటీ మోడల్ అయినా, అడ్వర్టైజింగ్ మోడల్ అయినా…క్యాట్ వాక్ మోడల్ అయినా నేను ఎప్పుడు మోడల్ గా ఉంటానికే ఇష్టపడతానని తెలిపారు. ఫ్యాషన్ కు సంబంధించిన ప్రతీదీ తనకు ఇష్టమనేనని తెలిపారు. ఏ అమ్మాయి అయిన మిస్ యూనివర్స్ లో పాల్గొనే అవకాశాన్ని సంతోషంగానే భావిస్తుందని తాను అనుకుంటున్నానని అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.