తెలంగాణ క్యాబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్

జిల్లాల పునర్విభజనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

తెలంగాణ క్యాబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్

Ponguleti Srinivasa Reddy (Image Credit To Original Source)

Updated On : January 18, 2026 / 10:09 PM IST
  • వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణ
  • జిల్లాల పునర్విభజనకు క్యాబినెట్ ఆమోదం
  • గోదావరి పుష్కరాలపై నిర్ణయాలు

Ponguleti Srinivasa Reddy: మేడారంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

వీలైనంత త్వరగా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింవది. జిల్లాల పునర్విభజనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

Also Read: కోహ్లీ సెంచరీ వృథా.. భారత్‌ ఓటమి.. సిరీస్‌ న్యూజిలాండ్‌దే..

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. గతంలో ఎన్నడూ హైదరాబాద్‌ వెలుపల క్యాబినెట్ భేటీ జరగలేదని అన్నారు. పొట్లపూర్ ఎత్తిపోతల పథకానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు. ఎస్‌బీఐకి స్థలాల కేటాయింపులకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని చెప్పారు.

వచ్చే ఏడాది జులై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయని అన్నారు. పుష్కరాలను అద్భుతంగా నిర్వహించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని తెలిపారు. ఆ నదీ ఒడ్డున ఉండే ఆలయాలన్నింటినీ కలిపి టెంపుల్‌ సర్క్యూట్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.