కోహ్లీ సెంచరీ వృథా.. భారత్‌ ఓటమి.. సిరీస్‌ న్యూజిలాండ్‌దే..

లక్ష్యఛేదనలో భారత్‌ తడబడింది. 46 ఓవర్ల వద్ద 296 పరుగులకే ఆలౌట్‌ అయింది.

కోహ్లీ సెంచరీ వృథా.. భారత్‌ ఓటమి.. సిరీస్‌ న్యూజిలాండ్‌దే..

Virat Kohli (Image Credit To Original Source)

Updated On : January 18, 2026 / 9:48 PM IST
  • న్యూజిలాడ్‌ 337 పరుగులు
  • భారత్ 296 పరుగులకే ఆలౌట్‌
  • 41 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ గెలుపు 

India vs New Zealand: భారత్, న్యూజిలాండ్ మధ్య ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇండియా ఓడిపోయింది. 41 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ గెలుపొందింది.

మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ 337 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో భారత్‌ తడబడింది. 46 ఓవర్ల వద్ద 296 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో 41 పరుగుల తేడాతో గెలిచి న్యూజిలాండ్‌ సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకుంది.

Also Read: Ravindra Jadeja: రవీంద్ర జడేజా ఇక రిటైర్ అవుతాడా?

కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ నితీశ్, హర్షిత్ మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ 11, శుభ్‌మన్ గిల్ 23, విరాట్ కోహ్లీ 124, శ్రేయాస్ అయ్యర్ 3, కేఎల్ రాహుల్ 1, నితీశ్ కుమార్ రెడ్డి 53, రవీంద్ర జడేజా 12, హర్షిత్ రాణా 52, మొహమ్మద్ సిరాజ్ 0, కుల్దీప్ యాదవ్ 5, అర్ష్‌దీప్ సింగ్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో ఫౌక్స్‌ క్రిస్టియన్‌ మూడేసి వికెట్లు తీయగా లనెక్స్‌ 2, జెమీసన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

న్యూజిలాండ్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే 5, హెన్రీ నికోల్స్ 0, విల్ యంగ్ 30, డారిల్ మిచెల్ 137, గ్లెన్ ఫిలిప్స్ 106, మైకేల్ బ్రేస్‌వెల్ 28 (నాటౌట్‌), మిచెల్ హే 2, జకరీ ఫౌల్క్స్ 10, క్రిస్టియన్ క్లార్క్ 11, కైల్ జేమీసన్ 0 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఇండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా మూడేసి వికెట్లు.. కుల్దీప్, సిరాజ్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.