SriLanka Crisis: కష్టకాలంలో మంచి మనసు.. టీ, బన్‌లు సర్వ్ చేసిన మాజీ క్రికెటర్

శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇటీవల ఆ దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయిన ఆర్థిక సంక్షోభం మెరుగుపడడంలేదు. ఆహార పదార్థాల కొరతకు తోడు ఇంధన సంక్షోభాన్నిసైతం ఎదుర్కొంటుంది. ఫలితంగా అనవసర ప్రయాణాలను తగ్గించుకోమని ప్రజలకు అక్కడి ప్రభుత్వం సూచించింది.

SriLanka Crisis: కష్టకాలంలో మంచి మనసు.. టీ, బన్‌లు సర్వ్ చేసిన మాజీ క్రికెటర్

Roshan

Updated On : June 19, 2022 / 7:34 PM IST

SriLanka Crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇటీవల ఆ దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయిన ఆర్థిక సంక్షోభం మెరుగుపడడంలేదు. ఆహార పదార్థాల కొరతకు తోడు ఇంధన సంక్షోభాన్నిసైతం ఎదుర్కొంటుంది. ఫలితంగా అనవసర ప్రయాణాలను తగ్గించుకోమని ప్రజలకు అక్కడి ప్రభుత్వం సూచించింది. దీనికితోడు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులు మినహా.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు సెలవులు ఇచ్చింది. అయితే కీలక ఉద్యోగులు మాత్రం కార్యాలయాలకు రావాలని సూచించింది.

Sri Lanka Crisis: శ్రీలంకలో ప్రభుత్వ కార్యాలయాలు మూసివేత.. ఆన్‌లైన్ ద్వారానే పాఠాలు

ఇంధన కొరతతో ఆ దేశంలోని పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. గంటలపాటు క్యూలో ఉంటున్నారు. దీంతో పలువురు ఆహారం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి ఇబ్బందులను గుర్తించిన శ్రీలంక మాజీ క్రికెటర్ రోషన్ మహానామా పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్ లో ఉన్న ప్రజలకు టీలు, స్నాక్స్ సర్వ్ చేశాడు. ఈ సందర్భంగా రోషన్ మహానామా మాట్లాడుతూ.. క్యూలో ఉన్నవాళ్లలో చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చునని, పైగా అంతసేపు క్యూలైన్ లో వేచియుండి ఆకలితో ఇబ్బందులు పడుతున్నారని, అందుకే వారికి సాయంగా టీ, స్నాక్స్ అందిస్తున్నట్లు తెలిపాడు.

Viral Video: కుక్కపిల్ల తిరిగినట్లు వీధుల్లో తిరిగిన పులి.. వణికిపోయిన స్థానికులు.. ఓ వ్యక్తి వచ్చి..

అంతేకాదు.. ప్రతి ఒక్కరిని తమ కోసం కాకపోయిన మన పక్కవారి కోసమైన ఏమైన ఆహార పదార్థాలు తీసుకువెళ్లండి అంటూ సూచించారు. ఎవరికైన అనారోగ్య సమస్య వస్తే వెంటనే 1990 నెంబర్ కు కాల్ చేయాలంటూ అక్కడి ప్రజలకు రోషన్ మహానామా సూచించారు. క్యూ లైన్ లో ఉన్న వారికి టీ, స్నాక్స్ అందిస్తున్న ఫొటోలను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో నెటిజన్లు రోషన్ మంచి మనసును అభినందిస్తున్నారు.