Gaganyaan మిషన్: Spaceలోకి ‘వ్యోమమిత్రా’ మాట్లాడే రోబో! 

  • Published By: sreehari ,Published On : January 22, 2020 / 01:47 PM IST
Gaganyaan మిషన్: Spaceలోకి ‘వ్యోమమిత్రా’ మాట్లాడే రోబో! 

Updated On : January 22, 2020 / 1:47 PM IST

చంద్రయాన్-2 ప్రయోగం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో దేశీయ ప్రతిష్టాత్మక మానవ సహిత ప్రయోగం Gaganyaan కు సన్నద్ధమవుతోంది. ఈ ప్రయోగంలో భాగంగా ఇస్రో మనుషులను అంతరిక్షంలోకి పంపనుంది. 2022 నాటికి ముగ్గురు భారతీయులను అంతరిక్షంలోకి పంపడమే లక్ష్యంగా ఇస్రో కసరత్తు చేస్తోంది.

ఇప్పటికి నలుగురు వ్యోమగాములను కూడా ఎంపిక చేసింది. గగన్ యాన్ ప్రయోగంలో ఈసారి మనుషులతో పాటు మాట్లాడే రోబో ‘వ్యోమ మిత్రా’ హ్యుమన్ Robotను కూడా ఇస్రో పంపనుంది. గగన్ యాన్ మిషన్ లో అంతరిక్షంలో పంపే వ్యోమగాముల్లో మహిళ వ్యోమగామిగా భారత వైమానిక దళ పైలట్లతో పాటు ఈ ఫీమేల్ హ్యూమనాయిడ్స్ రోబో కూడా ప్రయాణించనుంది.

వ్యోమ మిత్ర… అంటే? :
ఇస్రో ప్రకారం.. వ్యోమ మిత్ర.. హాఫ్ హ్యుమనాయిడ్.. మనిషి హావాభావాలను పలికించలగలదు. మనిషి చేసే పనులను అన్ని చేయగలదు. ఇతర మనుషులను కూడా సులభంగా గుర్తించగలదు. అంతరిక్షంలో కూడా మనుషులు చేసే ప్రతిపనిని అనుకరించగలదు. మనుషులతో సంభాషించగలదు… అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పగలదు. ఆమే.. వ్యోమ మిత్రా (vyommitra).. ఫీమేల్ హ్యుమన్ రోబో.. దీన్ని ఇస్రో డెవలప్ చేసింది.

అంతేకాదు.. ఈ ఫీమేల్ రోబో.. సొంతంగా మాట్లాడగలదు.. వ్యోమగామ సిబ్బంది చేసే కార్యకలాపాలను అనుకరించగలదు. వారు చేసే పనులను గుర్తించి అందుకు తగినట్టుగా రెస్పాండ్ కాగలదు. ఇటీవలే బెంగళూరులో ఇస్రో.. వ్యోమమిత్రాను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వ్యోమ మిత్రా.. అందరికి ఐయామ్ వ్యోమ మిత్రా.. ప్రొటోటైఫ్ హాఫ్ హ్యుమనాయిడ్ అంటూ తనకు తాను పరిచయం చేసుకుంది.

ఇస్రో శాస్త్రవేత్తల ప్రకారం..
Vyommitra హాఫ్ హ్యుమనాయిడ్.. అంటే.. ఈ రోబోకు కాళ్లు ఉండవు. అందుకే దీన్ని హాఫ్ హ్యుమనాయిడ్ రోబోగా పిలుస్తారు. ఇది కేవలం పక్కకు ఒరగడం, ముందుకు వెళ్లడం మాత్రమే చేయగలదు. నిర్దిష్టమైన ప్రయోగాలను ఇది మోసకెళ్తుంది.. అలాగే ఇస్రో కమాండ్ సెంటర్ తో ఎప్పటికప్పుడూ టచ్ లో ఉంటూ సమాచారాన్ని చేరవేస్తుందని ఇస్రో సైంటిస్ట్ శ్యామ్ డాయల్ తెలిపారు.

Gaganyaan ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది తర్వాత వ్యోమ మిత్రాను అంతరిక్షంలోకి పంపాలని ISRO ప్లాన్ చేస్తోంది. 2019 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ గగన్ యాన్ ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గగన్ యాన్ ప్రయోగంలో అంతరిక్షంలో వెళ్లే వ్యోమగాములుగా నలుగురు భారతీయ వైమానిక దళ పైలట్లను ఎంపిక చేశారు.

ప్రస్తుతం ఈ నలుగురు రష్యా, భారత్ లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. మరోవైపు.. భారత వైమానిక దళం నుంచి వైద్యులను కూడా ఫ్రాన్స్ కు పంపించడం జరిగింది. అక్కడ శిక్షణ తీసుకునే వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించనున్నారు.