Green House Effect : గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్‌కు స్మైక్టేట్ ఖనిజంతో చెక్
నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్టుకు చెక్ పెట్టే కొత్త ఖనిజాన్ని అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. సముద్ర గర్భంలో ఉన్న స్మైక్టెట్ ఖనిజంంతో వేడెక్కిన భూమిని చల్లబర్చవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు....

Global carbon
Green House Effect : నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్టుకు చెక్ పెట్టే కొత్త ఖనిజాన్ని అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. సముద్ర గర్భంలో ఉన్న స్మైక్టెట్ ఖనిజంంతో వేడెక్కిన భూమిని చల్లబర్చవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచంలో గ్రీన్ హౌస్ ఎఫెక్టుకు కారణమైన కార్బన్ ను స్మైక్టెట్ సంగ్రహించి భూమిని చల్లబరుస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
ప్రపంచ వాతావరణ మార్పులపై దుబాయ్ లో జరిగిన కాప్ 28 సదస్సులో వివిధ దేశాలు వెలువరిస్తున్న కార్బన్ డయాక్సైడ్ శాతాలతో తాజా నివేదికను విడుదల చేశారు. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో 14.9 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తుందని తాజా నివేదిక తెలిపింది. రష్యాలో 11.4 టన్నులు, జపాన్ దేశంలో 8.5, చైనాలో 8, ఐరోపాలో 6.2 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తున్నాయి. భారతదేశంలో కార్బన్ డయాక్సైడ్ సగటు 5 శాతం మేర పెరిగిందని గ్లోబల్ కార్బన్ ప్రాజెక్టు నివేదిక వెల్లడించింది.
ALSO READ : Ravindra Jadeja : రవీంద్ర జడేజా, రివాబాల ప్రేమ కథ…డేటింగ్
ఈ ఏడాది చివరి నాటికి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పెరుగుతుందని, దీన్ని తగ్గించేందుకు కాప్ సదస్సులో వివిధ దేశాల నేతలు చర్చలు జరిపారు. శిలాజ ఇంధనాల నుంచి ఈ సంవత్సరం చివరి నాటికి కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 36.8 బిలియన్ టన్నులకు చేరుకుంటాయని అంచనా వేశారు. బొగ్గు, గ్యాస్, చమురు వంటి శిలాజ ఇంధనాలను కాల్చడం వాతావరణంలోకి సీఓ2 ఉద్గారాలకు ప్రధాన కారణమని తేల్చారు.
ALSO READ : Michaung cyclone : మిగ్ జామ్ తుపాన్‌పై భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కామెంట్
పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ఇదే కారణమని వెల్లడైంది. గ్రహం వేడెక్కుతున్న గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించాలని పలు దేశాలు సంవత్సరాలుగా కట్టుబడి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా స్మైక్టెట్ ఖనిజంతో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తగ్గించగలిగితే భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు కళ్లెం వేయవచ్చని అమెరికన్ పరిశోధకులు చెబుతున్నారు.