Hamas Air Chief : గాజాపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌ల దాడి…హమాస్ ఎయిర్ చీఫ్ అబూ రకాబా హతం
గాజాపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌ల దాడి జరిగింది. ఈ దాడిలో హమాస్ ఎయిర్ చీఫ్ అబూ రకాబా హతం అయ్యాడని ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి. వందలాది మంది హమాస్ ముష్కరులు పారాగ్లైడర్‌లపై ఇజ్రాయెల్‌లోకి చొరబడి 1,400 మందికి పైగా మరణించారు....

IDF Fighter Jets
Hamas Air Chief : గాజాపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌ల దాడి జరిగింది. ఈ దాడిలో హమాస్ ఎయిర్ చీఫ్ అబూ రకాబా హతం అయ్యాడని ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి. వందలాది మంది హమాస్ ముష్కరులు పారాగ్లైడర్‌లపై ఇజ్రాయెల్‌లోకి చొరబడి 1,400 మందికి పైగా మరణించారు. అక్టోబర్ 7వతేదీన దాడి సూత్రధారుల్లో అబు రకాబా ఒకడని ఇజ్రాయెల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి.
Also Read : Mukesh Ambani : రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం : ముకేశ్ అంబానీకి బెదిరింపు
గాజాలోని అతని రహస్య స్థావరంపై దాడిలో హమాస్ వైమానిక శ్రేణి అధిపతి అసేమ్ అబు రకాబాను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అబూ రకాబా హమాస్ మానవరహిత వైమానిక వాహనాలు, డ్రోన్లు, పారాగ్లైడర్లు, వాయు రక్షణ వ్యవస్థలు నిర్వహించారు. సరిహద్దు వెంబడి ఇజ్రాయెల్ సైనిక పోస్టులపై డ్రోన్ దాడులు చేసిన ఉగ్రవాదులకు కూడా అబు రకాబా నాయకత్వం వహించారు.
Also Read : Gaza : ఇజ్రాయెల్ దాడులతో గాజా గజగజ..ఫోన్లు, ఇంటర్‌నెట్ నిలిపివేత
హమాస్‌ను నాశనం చేస్తామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. గాజాలోని హమాస్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ తన వైమానిక, భూ దాడులను తీవ్రతరం చేసింది. హమాస్ ఉగ్రవాద సామర్థ్యాలను నాశనం చేయడం, బందీలను స్వదేశానికి తీసుకురావడం ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది.