Israeli Hostages : గాజాలో ముగ్గురు మహిళా బందీలను విడుదల చేసిన హమాస్‌.. రెడ్‌క్రాస్‌కు అప్పగింత

Israeli Hostages : గాజాలో కాల్పుల విరమణ తర్వాత ఒప్పందంలోని నిబంధనల ప్రకారం.. హమాస్ మొదటి ముగ్గురు బందీలను విడుదల చేసింది.

Israeli Hostages : గాజాలో ముగ్గురు మహిళా బందీలను విడుదల చేసిన హమాస్‌.. రెడ్‌క్రాస్‌కు అప్పగింత

Israeli Hostages

Updated On : January 19, 2025 / 11:50 PM IST

Israeli Hostages : గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత హమాస్ మొదటి ముగ్గురు బందీలను రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. ఇప్పుడు వారిని ఇజ్రాయెల్‌కు తరలిస్తున్నారు. ఆ ముగ్గురు ఇజ్రాయెలీ బందీలు రోమీ గోనాన్ (24), ఎమిలీ డమారి (28), డోరన్ స్టెయిన్‌బ్రేచర్‌ (31)లను హమాస్ విడుదల చేసింది. హమాస్ ఈ ముగ్గురు బందీలను ఇజ్రాయెల్ సంస్థ రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. ఈ విషయాన్ని హమాస్ కూడా ధృవీకరించింది.

Read Also : Donald Trump : అధ్యక్ష బాధ్యతల తర్వాత భారత్‌లో ట్రంప్‌ పర్యటించే అవకాశం..!

ఇజ్రాయెల్ బందీలుగా ఉన్న రోమీ గోనాన్, ఎమిలీ డమారి, డోరన్ స్టెయిన్‌బ్రేచర్ ఎవరి సాయం లేకుండా నడుస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. పశ్చిమ గాజా నగరంలోని అల్-సరయా స్క్వేర్ వద్ద ముగ్గురు మహిళా బందీలను అధికారికంగా రెడ్‌క్రాస్‌కు అప్పగించినట్లు హమాస్ ధృవీకరించింది. రెడ్‌క్రాస్ సభ్యుడు హమాస్ యోధులతో సమావేశమై బందీల ఆరోగ్యాన్ని నిర్ధారించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా గాజాలోని హమాస్ బందిఖానాలో 15 నెలలకు పైగా గడిపిన తర్వాత ముగ్గురు ఇజ్రాయెలీ బందీలు స్వదేశానికి తిరిగి వచ్చారు.

గాజాలో ముగబోయిన తుపాకులు :
‘ఈరోజు గాజాలో తుపాకులు నిశ్శబ్దంగా ఉండిపోయాయి. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. “గాజా కాల్పుల విరమణ ఒప్పందం విజయవంతమైంది. వందలాది సహాయక ట్రక్కులు గాజాలోకి ప్రవేశిస్తున్నాయి. చాలా విధ్వంసం తర్వాత, ఈ రోజు మేం గాజాలో తుపాకులు నిశ్శబ్దంగా ఉండిపోయాయి” ఊహించిన విధంగా మధ్యప్రాచ్యంలో యుద్ధం నిలిచిపోయిందని అన్నారు.

అందిన సమాచారం ప్రకారం.. గతంలో విడుదల చేసిన ముగ్గురు బందీలు మహిళలే. కాల్పుల విరమణకు అంగీకరించిన తరువాత 15 నెలలుగా కొనసాగుతున్న భీకర యుద్ధం ఎండ్ కార్డు పడినట్టు అయింది. అయితే, హమాస్ విడుదల చేయనున్న బందీల జాబితాను అందజేయడంలో జాప్యం కారణంగా కాల్పుల విరమణ ఆలస్యమైంది.

ఇలాంటి పరిస్థితిలో, ఇజ్రాయెల్ సైన్యం మరోసారి దాడికి దిగింది. ఇందులో కనీసం 19 మంది మరణించారు. ఇజ్రాయెల్ దాదాపు 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. వీరిలో 69 మంది మహిళలు ఉన్నారు. తదుపరి 6 వారాల్లో 33 మంది బందీలను క్రమంగా విడుదల చేయనున్నారు. ఇజ్రాయెల్ దాదాపు 2వేల మంది పాలస్తీనియన్ ఖైదీలను గాజా నుంచి నిర్బంధించిన పాలస్తీనియన్లను విడుదల చేయనుంది.

విముక్తి పొందిన స్త్రీలు ఎవరు? :
విడుదల అయిన మహిళా బందీల్లో రోమీ గోనెన్, డోరన్ స్టెయిన్‌బ్రేచర్, ఎమిలీ డమారి ఉన్నారు. వారిలో 24 ఏళ్ల రోమి గోనెన్ ఇజ్రాయెల్‌లోని క్ఫర్ వ్రాడిమ్ నివాసి. ఆమెకు ట్రావెలింగ్, డ్యాన్స్ అంటే ఇష్టం. అక్టోబర్ 7న నోవా ఫెస్టివల్ నుంచి హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. రెండో మహిళ డోరన్ స్టెయిన్‌బ్రేచర్ కాఫర్ గాజాకు చెందినవారు. ఆమె వెటర్నరీ నర్సు. ఆమెకు జంతువులంటే చాలా ఇష్టం. కిబ్బట్జ్ నుంచి ఆమెను కిడ్నాప్ చేశారు. మూడో మహిళ ఎమిలీ దమరి బ్రిటన్ పౌరురాలు.

ఆమె ప్రస్తుతం కాఫర్ గాజాలో నివసిస్తున్నారు. ఆమె స్నేహితులు కూడా చాలా మంది కిడ్నాప్ అయ్యారు. ఒప్పందం మొదటి దశ ప్రకారం.. 42 రోజుల పాటు కాల్పుల విరమణ ఉంటుంది. ఈ సమయంలో, 33 బందీలను హమాస్ విడుదల చేస్తుంది. వీరిలో మహిళలు, 50 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉన్నారు. గాజా సరిహద్దు సమీపంలోని సైనిక శిబిరం వద్ద సమావేశానికి రావాల్సిందిగా ముగ్గురు బందీల తల్లులను సైన్యం కోరినట్లు ఇజ్రాయెల్ మీడియా నివేదికలు తెలిపాయి.

Read Also : Mukesh Ambani: డొనాల్డ్ ట్రంప్‌ను కలిసిన ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీ