Harpy Drones: హార్పీ.. వెరీ డేంజరస్.. పాక్‌ను చావుదెబ్బ తీసిన డ్రోన్లు.. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తుక్కుతుక్కు..
రాడార్ వ్యవస్థలపై దాడి చేయడానికి రూపొందించిన హార్పీ డ్రోన్‌లను పాకిస్తాన్‌లోని వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడానికి భారత సాయుధ దళాలు ఉపయోగించాయి.

Harpy Drones: బరితెగించిన పాకిస్తాన్ కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. భారత్ పై దాడికి యత్నించిన పాక్ కు తిక్క కుదిర్చింది. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను కూల్చేయడే కాదు.. ఆ దేశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను తుక్కుతుక్కు చేసింది ఇండియన్ ఆర్మీ. ఇందులో భారత్ హార్పీ డ్రోన్లను వాడింది. ఈ పవర్ ఫుల్ డ్రోన్లతో శత్రు దేశానికి దిమ్మతిరిగిపోయేలా చేసింది భారత్.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. వాటి నేలమట్టం చేసింది. ముష్కరులను మట్టుబెట్టింది. దీంతో పాకిస్తాన్ భారత్ పై దాడులకు ప్రయత్నించింది. అయితే, భారత్ ఆ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది.
ఉత్తర, పశ్చిమ భారత్ లోని కీలక సైనిక స్థావరాలు లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడింది. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్.. పాక్ కు బుద్ధి చెప్పింది. ఆ దేశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను తుక్కుతుక్కు చేసింది. ఇందుకోసం భారత్ హార్పీ డ్రోన్లను వాడింది. రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడానికి రూపొందించిన హార్పీ డ్రోన్‌లను ఉపయోగించి భారత దళాలు లాహోర్‌లోని వైమానిక రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేశాయి.
రాడార్ వ్యవస్థలపై దాడి చేయడానికి రూపొందించిన హార్పీ డ్రోన్‌లను పాకిస్తాన్‌లోని వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడానికి భారత సాయుధ దళాలు ఉపయోగించాయి. లాహోర్‌లోని వైమానిక రక్షణ వ్యవస్థను భారత సైనిక డ్రోన్ నిర్వీర్యం చేసింది.
Also Read: దటీజ్ ఇండియా.. ఆపరేషన్ సిందూర్‌తో గీత దాటకుండానే పాకిస్తాన్‌ని చావుదెబ్బ కొట్టిన భారత్..
హార్పీ.. రాడార్ వ్యవస్థలపై దాడి చేయడానికి రూపొందించబడింది. శత్రు వైమానిక రక్షణ పాత్రను అణచివేయడానికి ఆప్టిమైజ్ చేయబడింది. ఇది అధిక-పేలుడు వార్‌హెడ్‌ను కలిగి ఉంటుంది. యాంటీ-రేడియేషన్ (AR) సీకర్‌తో అమర్చబడిన హార్పీ.. ఉద్గార, అధిక-విలువ లక్ష్యాలను స్వయంప్రతిపత్తితో వెతికి కొట్టగలదు. హార్పీ అన్ని వాతావరణ పరిస్థితుల్లో అంటే పగలు, రాత్రి 9 గంటల వరకు జరిగే లోతైన మిషన్లు, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ (GNSS) తిరస్కరించబడిన లేదా పోటీ చేయబడిన యుద్ధభూమిలలో పని చేస్తుంది.
హార్పీ అనేది నిర్దేశించిన ప్రాంతంలో లక్ష్యాలను వేటాడేందుకు, వాటి ఫ్రీక్వెన్సీని గుర్తించడానికి, ఏ దిశ నుండి అయినా స్వయంప్రతిపత్తితో దాడి చేయడానికి ఉపయోగిస్తారు. పాకిస్తాన్, పీవోకేలోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత్ నాశనం చేసిన తర్వాత పాక్ రెచ్చిపోయింది. మే 7 రాత్రి అనూహ్యంగా భారత్ పై దాడులకు యత్నించింది. భారత్ లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించింది.
అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరలై , భుజ్ లో డ్రోన్లు, క్షిపణులతో దాడులకు ప్రయత్నించింది పాక్. వెంటనే అప్రమత్తమైన భారత వైమానిక దళం S-400 సుదర్శన్ చక్ర వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను కూల్చేసింది.