Helicopter Crash: బాబోయ్.. గిరగిరా తిరుగుతూ నదిలో కుప్పకూలిన హెలికాప్టర్.. అందులో ప్రయాణించేది ఎవరంటే..? వీడియో వైరల్..

న్యూయార్క్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ నదిలో కుప్పకూలిపోయింది.

Helicopter Crash: బాబోయ్.. గిరగిరా తిరుగుతూ నదిలో కుప్పకూలిన హెలికాప్టర్.. అందులో ప్రయాణించేది ఎవరంటే..? వీడియో వైరల్..

Helicopter Crash

Updated On : April 11, 2025 / 9:33 AM IST

Helicopter Crash: న్యూయార్క్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టెక్ కంపెనీ సీఈవో, అతని కుటుంబం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నదిలో కూలిపోయింది. గురువారం మధ్యాహ్నం (అమెరికా కాలమానం ప్రకారం) అందరూ చూస్తుండగానే హెలికాప్టర్ గాలిలో గిరగిరా తిరుగుతూ నదిలో కుప్పకూలిపోయింది.

Also Read: AP: ఏపీ సముద్ర తీర ప్రాంతంలో చేపల వేట నిషేధం.. వారికి మాత్రం మినహాయింపు.. ఎప్పటివరకంటే?

హెలికాప్టర్ నదిలో కూలిపోయిన వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలంలో బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ తలకిందులుగా పూర్తిగా నీళ్లలో కూరుకుపోయింది. అయితే, గాల్లో ఉండగానే హెలికాప్టర్ లోని ఒక భాగం విగిరిపోయిందని అధికారులు చెబుతున్నారు. హెలికాప్టర్ కూలిపోతున్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Vijayawada: ఐస్ క్రీమ్‌లో సైనైడ్ కలిపి కొడుక్కి ఇచ్చిన తండ్రి.. ఆ తరువాత తానూ తాగేసి.. పోలీసుల విచారణలో ..

జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సీమెన్స్ కంపెనీ స్పెయిన్ విభాగ అధిపతి, సీఈవో అగస్టన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో వీరి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉన్నట్లుండి ఒక్కసారిగా నదిలో కుప్పకూలిపోయింది. హెలికాప్టర్ లో ఎస్కోబార్, ఆయన భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరితోపాటు పైలట్ కూడా ఉన్నారు. వీరంతా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్ ప్రమాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని భయంకరమైనదిగా అభివర్ణించారు.