కుక్క విశ్వాసం :యజమాని కుటుంబాన్ని కాపాడి మంటల్లో కాలిపోయింది

  • Published By: veegamteam ,Published On : September 19, 2019 / 09:18 AM IST
కుక్క విశ్వాసం :యజమాని కుటుంబాన్ని కాపాడి మంటల్లో కాలిపోయింది

Updated On : September 19, 2019 / 9:18 AM IST

కుక్కలు విశ్వాసానికి మారుపేరు అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాస్త ఆదరిస్తే చాలా వాటి ప్రాణాన్ని కూడా పణ్ణంగా పెట్టి యజమానుల్ని కాపాడుకుంటాయి. అలా తన యజమానికుటుంబాన్ని కాపాడి ప్రాణాలో కోల్పోయింది ఓ కుక్క. ఆ కుక్క చేసిన త్యాగం..సాహసం గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు అమెరికాలోని ఫ్లోరిడావాసులు. 

అది ఫ్లోరిడాలోని బ్రాడెన్టన్‌ ప్రాంతం. అక్కడ లెరాయ్ బట్లర్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఆ  ఇంట్లో సోమవారం (సెప్టెంబర్ 16) రాత్రి అర్థరాత్రి రెండు గంటలకు హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఫైర్ అలారం మోగింది. అందరూ మంచి గాఢ నిద్రలో ఉండటంతో వారికి అలారం సౌండ్ వినిపించలేదు. క్షణాల్లో మంటలు ఇంటినిండా వ్యాపిస్తున్నాయి. అది గమనించిన లెరాయ్ పెంపుడు కుక్క జిప్పీ గట్టిగా అరిచింది. ఆ అరుపులకు కూడా వారు లేవలేదు. వారిని నిద్రలేపేందుకు అరుస్తూ..ఎట్టకేలకూ నిద్రలేపింది.

కుక్క అదేపనిగా అరుస్తుండటంతో లెరాయ్ బట్లర్‌ నిద్రలేచాడు. కు ఇంటి నిండా పొగ కమ్మేయటం కనిపించింది. దీంతో అప్రమత్తమైన లెరాయ్ అందరినీ నిద్రలేపాడు. తలుపులన్నీ తెలిచాడు.అప్పటికే బెడ్ రూమ్స్, హల్‌లో మంటలు భారీ వ్యాపించాయి. వెంటనే అందరూ ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. కానీతమను నిద్రలేపిన కుక్క జిప్పీ  మాత్రం లోపలే ఉండిపోయింది. దాన్ని సురక్షితంగా బైటకు తీసుకొచ్చేందుకు లెరాయ్ ఇంట్లోకి వెళ్లాడు. అప్పటికే భారీగా మంటలతో పాటు పొగ వ్యాపించటంతో జిప్పీని తీసుకురావటం కుదర్లేదు. 

అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించటం ఫైర్ ఇంజన్లతో వారు వచ్చేసరికి ఇంట్లోని సామాన్లతో పాటు జిప్పీ కూడా అగ్ని మంటలకు ఆహుతైపోయింది. జిప్పీ చిన్నపిల్ల కావటంతో మంటలను ఏమాత్రం తట్టుకోకపోయింది. బైటకు రాలేకపోయిందనీ లెరాయ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. తమ   కుటుంబాన్ని కాపాడి జిప్పీని జీవితాంతం మరిచిపోలేమని కన్నీటి పర్యమంతమయ్యారు. కాగా..లెరాయ్ ఇంట్లో అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే విషయం మాత్రం తెలియరాలేదు.