మీకెంత ధైర్యం?: ప్రపంచ దేశాధినేతల్నికడిగిపారేసిన బాలిక

ప్రపంచ దేశాధినేతల్ని ఓ బాలిక కడిగిపారేసింది. ఐక్యరాజ్యసమితి వేదికగా గళమెత్తిన 16 బాలిక దేశాధినేతలపై విరుచుకుపడింది. ఐక్యరాజ్య సమితిలో జరిగిన పర్యావరణ సదస్సు వేదికగా స్వీడన్ కు చెందిన క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థున్‌బర్గ్ దేశాధినేతల్ని కడిగిపారేసింది. పర్యావరణాన్ని నాశనంచేసేలా వ్యవహరిస్తు..భవిష్యత్ తరాల జీవితాలను నాశనం చేస్తున్నారంటు మండిపడింది. మా బాల్యాన్ని చిదిమేయటానికి మీకెవరిచ్చారు? మీకెంత ధైర్యం మా భవిష్యత్తుని నాశనం చేయటానికి అంటూ తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నించింది.
పర్యావరణం నాశనం అయిపోతోంది. దీనికి మీరంతా సమాధానం చెప్పి తీరాలంటూ నిలదీసింది. పర్యావరణం ప్రతీప్రాణి సొత్తు దాన్ని నాశనం చేయటానికి మీకెవరిచ్చారు ఆ అధికారం? అంటూ నిలదీసింది. ప్రపంచంలోని ప్రధానులు..అధ్యక్షులు అంతా మా కలలను నాశనం చేశారు. మా బాల్యాన్ని చిదిమేశారు. మా భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేశారు. పర్యావరణం నాశనమైపోతోంది. ప్రజలు చనిపోతున్నారు. కానీ మీకు ఇవేమీ పట్టవు. అధికారం..డబ్బు,అభివృద్ధి అంటూ ప్రజల్ని మభ్యపెడుతూ కథలు చెబుతున్నారు..ఎవరి అధికారాలు వారు కాపాడుకునేందుకు ప్రజల్ని సమస్యల పాలు చేస్తున్నారంటూ
హాయిగా చదువుకోవాల్సిన నేను..దేశాలను పాలిస్తున్న మీ అలసత్వం వల్లే ఇక్కడికి వచ్చానని గ్రెటా ఆవేశంతో కూడిన ఆవేదనను వ్యక్తం చేసింది. పర్యావరణం రోజు రోజుకూ నాశనమైపోతోంది. దాంతో పాటు మనమంతా కూడా సామూహిక వినాశనం ముంగిట్లో నిల్చున్నామంటూ ఆందోళన వ్యక్తం చేసింది. మా కళ్లన్నీ పాలకులైన మీపైనే ఉన్నాయి.
మీరు మా తరాన్ని..మోసం చేస్తున్నారనే విషయం మాకు అర్థమైంది. మేము మీ అలసత్వాన్ని తెలుసుకోలేమనుకుంటున్నారేమో కానీ మాకన్నీ అర్థమవుతున్నాయి. ఇప్పటికైనా మేలుకోండి..పర్యావరణాన్ని పరిరక్షించండి..భవిష్యత్ తరాలను నాశనం చేసే హక్కు మీకు లేదు..ఇదే విధానాన్ని మీరు కొనసాగిస్తే మిమ్మల్ని మేం క్షమించం అని ఘాటుగా ఝలక్ ఇచ్చింది. బాలిక ప్రసంగం విన్న దేశాధినేతలు ఇప్పటికైనా మేలుకుని పర్యావరణ పరిరక్షణ దిశగా చర్యలు చేపడతారని ఆశిద్దాం.
How dare you? : Greta Thunberg to world leaders at UN Climate Summit
Read @ANI Story | https://t.co/51BEZrQLcF pic.twitter.com/X35tLafWwe
— ANI Digital (@ani_digital) September 23, 2019