Srilanka IMF : శ్రీలంకలో IMF బృందం పర్యటన .. అప్పు ఇచ్చే విషయంలో ఆర్థిక విధి విధానాలపై చర్చ

భారత్‌కు అభ్యంతరాలు ఉన్నాయని తెలిసినప్పటికీ...చైనా నిఘా నౌకను తమ జలాల్లోకి అనుమతించిన శ్రీలంక...ఇప్పుడు మాత్రం బతిమాలే ధోరణిలోకి దిగింది. భారత్ తమ పరిస్థితిని అర్ధం చేసుకోవాలని, ఇది దౌత్య సమస్య కాకూడదని కోరుకుంటోంది. మరోవైపు శ్రీలంక ఆర్థిక స్థితిని అంచనావేసేందుకు IMF ఆ దేశంలో ఎనిమిది రోజుల పాటు పర్యటించనుంది.

Srilanka IMF : శ్రీలంకలో IMF బృందం పర్యటన .. అప్పు ఇచ్చే విషయంలో ఆర్థిక విధి విధానాలపై చర్చ

IMF visits from Sri Lankan

Updated On : August 22, 2022 / 11:15 AM IST

IMF Staff Statement on Sri Lanka : భారత్‌కు అభ్యంతరాలు ఉన్నాయని తెలిసినప్పటికీ…చైనా నిఘా నౌకను తమ జలాల్లోకి అనుమతించిన శ్రీలంక…ఇప్పుడు మాత్రం బతిమాలే ధోరణిలోకి దిగింది. భారత్ తమ పరిస్థితిని అర్ధం చేసుకోవాలని, ఇది దౌత్య సమస్య కాకూడదని కోరుకుంటోంది. మరోవైపు శ్రీలంక ఆర్థిక స్థితిని అంచనావేసేందుకు IMF ఆ దేశంలో ఎనిమిది రోజుల పాటు పర్యటించనుంది.

చైనా నిఘా నౌక యువాన్ వాంగ్ -5 హంబన్‌టోట్ పోర్టుకు రావడంపై భారత్‌ తొలి నుంచీ అభ్యంతరాలు వ్యక్తంచేసింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న దగ్గరనుంచి భారత్ అందిస్తున్న సాయాన్ని, గత స్నేహాన్ని దృష్టిలో ఉంచుకుని..శ్రీలంక ఆ నౌకను హంబన్‌టోటకు అనుమతించబోదనే అంతా భావించారు. కానీ పోర్టుపై 99 ఏళ్ల లీజు అధికారం ఉన్న చైనా ఒత్తిడికి శ్రీలంక తలొగ్గింది. నౌకను అనుమతించింది. దక్షిణాది పోర్టులు సహా…భారత క్షిపణి ప్రయోగ కేంద్రాలపై నిఘా ఉంచగల యువాన్ వాంగ్‌-5ను పరిశోధనల కోసమే హంబన్‌టోటలో మోహరించామని చైనా చెబుతున్నప్పటికీ…అది నిజం కాదని అందరికీ తెలుసు.

నౌక తమ దేశానికి రాకుండా అడ్డుకోలేకపోయిన శ్రీలంక ఇప్పుడు భారత్‌ను బతిమాలుకుంటోంది . శ్రీలంక చిన్నదేశమని, అన్ని దేశాలతో తమకు మంచి మితృత్వం ఉందని, చైనా గతంలో శ్రీలంకలో చాలా పెట్టుబడులు పెట్టిందని చెప్పుకొచ్చింది. తమ పరిస్థితిని భారత్ అర్ధం చేసుకుంటుందని, ఇండియాతో తమకు మంచి దౌత్యపరమై సంబంధాలున్నాయని వ్యాఖ్యానిస్తోంది. శ్రీలంక అధ్యక్షుడు, ఆ దేశ విదేశాంగ మంత్రి భారత ప్రధాని మోదీతోను, విదేశాంగమంత్రి జై శంకర్‌తోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపింది.

మరోవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంకలో అంతర్జాతీయ ద్రవ్యనిధి బృందం పర్యటించనుంది. ఈ నెల 24 నుంచి 31దాకా ఎనిమిది రోజుల పాటు IMF బృందం శ్రీలంక ప్రభుత్వంతో చర్చలు జరపనుంది. ఆర్థిక విధానాలు, సంస్కరణలు, ఆర్థిక సాయం వంటివాటిపై చర్చించనుంది. శ్రీలంకకు అందించే అప్పులపై ప్రత్యక్ష ఒప్పందం కుదుర్చుకోవడమే ఈ పర్యటన లక్ష్యం

శ్రీలంకకు భారీగా అప్పులిచ్చేందుకు IMF సిద్ధంగా ఉన్నప్పటికీ..హామీలు కోరుతోంది. దివాళా తీసిన శ్రీలంకకు IMF ఒప్పందం కుదిరేదాకా ఇతర దేశాలు అప్పులిచ్చే పరిస్థితి లేదని నెల క్రితం రణిల్ విక్రమ్‌సింఘే ఆందోళన వ్యక్తంచేశారు. పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసరాలు దొరక్క..బతికే దారిలేక శ్రీలంక ప్రజలు కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభానికి దారితీసింది. కొత్త అధ్యక్షుని ఎన్నికకు దారితీసింది. రాజకీయంగా ప్రశాంత పరిస్థితులు ఉండడంతో IMFతో ఒప్పందం కుదుర్చుకోవడం…ఇతర దేశాల నుంచి అప్పులు పొందడం ద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకోవాలని శ్రీలంక ఆరాటపడుతోంది.