Pakistan Political Turmoil: దేశ ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ఇమ్రాన్ తాపత్రయం: ఆపద్ధర్మ ప్రధానిగా గుల్జార్ అహ్మద్

ప్రస్తుతం పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానిగా ఆదేశ సుప్రీం కోర్టు మాజీ ప్రధాని గుల్జార్ అహ్మద్ ను ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇమ్రాన్ ఖాన్

Pakistan Political Turmoil: దేశ ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ఇమ్రాన్ తాపత్రయం: ఆపద్ధర్మ ప్రధానిగా గుల్జార్ అహ్మద్

Imran

Updated On : April 5, 2022 / 11:22 AM IST

Pakistan Political Turmoil: పాకిస్తాన్ లో జాతీయ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. చావుతప్పి కన్నులొట్టబోయిందన్న చందంగా అవిశ్వాస తీర్మానాన్ని తప్పించుకుని ప్రభుత్వాన్ని రద్దు చేసిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్..ఆమేరకు దేశంలో ముందస్తుకు వెళ్లాలని ప్రకటించారు. దీంతో ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించని నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్..జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలంటూ దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి సూచించారు. ఇదిలాఉంటే..అవిశ్వాసాన్ని తప్పించి ముందస్తు ప్రకటన చేసిన ఇమ్రాన్ ఖాన్..ఇపుడు దేశ ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు వ్యూహరచన చేస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానిగా ఆదేశ సుప్రీం కోర్టు మాజీ ప్రధాని గుల్జార్ అహ్మద్ ను ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇమ్రాన్ ఖాన్. పార్టీ కీలక సభ్యులతో చర్చించిన అనంతరం ఇమ్రాన్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Also read:Amit Shah: నా వాయిస్ హై పిచ్ లో ఉంటుంది..తప్పుగా అనుకోవద్దు..అది మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ ..

కాగా, 2019 డిసెంబర్ 21న పాకిస్తాన్ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన గుల్జార్ అహ్మద్..తన పదవీ కాలం సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. సుప్రీం న్యాయమూర్తిగా రాజకీయ నేతలపైనే బాహాటంగా చర్యలు తీసుకున్న గుల్జార్ అహ్మద్ దేశ ప్రజల్లో బి\న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పనామా పేపర్స్ కేసులో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటు వేసిన సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ అహ్మద్ కీలక పాత్ర పోషించారు. నవాజ్ షరీఫ్ దేశ ప్రజలతో నిజాయితీగా వ్యవహరించలేదని, ప్రధాని పదవికి అనర్హులుగా ప్రకటించాలని అభిప్రాయపడిన సుప్రీం బెంచ్‌లోని ఇద్దరు అసమ్మతి న్యాయమూర్తులలో గుల్జార్ ఒకరు. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం, జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత ప్రధానమంత్రి మరియు ప్రతిపక్ష నాయకుని సంప్రదింపులతో అధ్యక్షుడు తాత్కాలిక ప్రభుత్వాన్ని నియమిస్తారు. ఈక్రమంలో పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ గుల్జార్ అహ్మద్ ను ఆపద్ధర్మ ప్రధానిగా సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో ప్రభుత్వం రద్దైన కారణంగా తిరిగి ఎన్నికలు జరిగి తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు గుల్జార్ అహ్మద్ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు.

Also read:Indonesian : కీచక టీచర్ కు మరణ శిక్ష విధించిన ఇండోనేషియా కోర్టు