దావోస్ పర్యటన ఖర్చుకు ప్రభుత్వానికి సంబంధం లేదు: పాక్ పీఎం

దావోస్ సభకువెళ్లేందుకు పాక్ ప్రధానికి తన స్నేహితులు సాయం చేశారని ఆయనే స్వయంగా చెప్పారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు ఖర్చులు ప్రభుత్వం భరించలేని పక్షంలో స్నేహితులైన వ్యాపారవేత్తలు షెహగల్, ఇమ్రాన్ చౌదరి ఆ ఖర్చులు కేటాయించినట్లు తెలిపారు. దావోస్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. వాళ్లు ఖర్చు పెట్టకపోయినట్లయితే తిరిగి దావోస్ రాగలిగే వాడిని కాదని అన్నారు.
‘నా స్నేహితుడు షెహగల్ రిటైర్డ్ మిలటరీ అధికారికి కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చేందుకు వారు ఎంతో సహాయం చేశారు. ఇక్కడ రెండు రాత్రులకు 4లక్షల 50వేల డాలర్లు ఖర్చును మా ప్రభుత్వం భారం అవుతుంది. మా ప్రభుత్వం చెల్లించలేదు’ అని ఆయన దావోస్‌లో అన్నట్లు పాక్ పత్రిక డాన్ పేర్కొంది. ఆర్థిక పరిస్థితుల సమస్య కారణంగా పాక్ విదేశీ పర్యటనలపై నియంత్రణ ఉన్న విషయం తెలిసిందే.
‘మంత్రులు ఎక్కడికైనా వెళ్తున్నట్లు చెప్పిన వెంటనే వారిని ఆపి.. పర్యటన వల్ల దేశానికి ఉపయోగం ఉందని తెలిస్తేనే అనుమతిస్తాను’ అని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి అధికారిక పర్యటనకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఖర్చు పెట్టడం ఇదే తొలిసారట. మరి మనదేశంలో ఈ పర్యటనలకు ఎంతెంత ఖర్చు అవుతున్నాయో.. ఎటువంటి లాభాలు ఉన్నాయని పర్యటనలకు వెళ్తున్నారో అని విమర్శలు వినిపిస్తున్నాయి.