న్యూయార్క్ చరిత్రలోని తొలిసారి.. గ్రాండ్‌గా Independence day సెలబ్రేషన్స్

న్యూయార్క్ చరిత్రలోని తొలిసారి.. గ్రాండ్‌గా  Independence day సెలబ్రేషన్స్

Updated On : August 11, 2020 / 3:38 PM IST

భారత సంతతికి చెందిన అమెరికన్లు తొలిసారి త్రివర్ణ పతాకాన్ని టైమ్స్ స్క్వేర్ వద్ద ఎగరేయనున్నారు. న్యూయార్క్ లో మన జాతీయ జెండా ఎగరడం ఇదే ప్రథమం. ట్రై స్టే ఏరియాకు చెందిన ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేట్స్ (ఎఫ్ఐఏ) 2020 ఆగష్టు 15న చరిత్ర సృష్టించనున్నాయి. భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజు టైమ్స్ స్క్వేర్ వద్ద జెండాను ఎగరేసి చారిత్రక ఘట్టాన్ని నమోదు చేయనున్నట్లు తెలిపారు.



‘దిగ్గజ వేదిక చిహ్నంగా భారత త్రివర్ణ పతాకం ఎగరడం ఇదే తొలిసారి’ అని ఆర్గనైజేషన్ చెప్పింది. కార్యక్రమానికి న్యూయార్క్ లోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా రంధీర్ జైస్వాల్ అతిథిగా రానున్నారు. ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా జెండా మహోత్సవం టైమ్స్ స్క్వేర్ వద్ద నిర్వహించనున్నాం. అంపైర్ స్టేట్ బిల్డింగ్ వద్ద త్రివర్ణ పతాకం.. కాషాయం, తెలుపు, పచ్చ రంగుల్లో మెరిసిపోనుంది.



టైమ్స్ స్క్వేర్ వేదికగా జరుగుతున్న ఈ ఈవెంట్ ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ దేశ భక్తి పెరిగేలా చేస్తుంది. ఎఫ్ఐఏ సెలబ్రేట్ చేసుకుంటున్న గోల్డెన్ జూబిలీ ఇయర్ కు ఇదొక బహుమానం’ అని ఆర్గనైజేషన్ చెప్పింది. జెండా ఎగరేయడంతో పాటు పరేడ్ ను కూడా నిర్వహించనున్నారు.