Uber Charged RS 32 Lakh : ప్రయాణికుడికి ఊబర్ షాక్.. 15 నిమిషాల ప్రయాణానికి రూ.32 లక్షలు చార్జ్
లండన్ లో ఊబర్ 15 నిమిషాల ప్రయాణానికి రూ.32 లక్షలు చార్జ్ చేసింది. ఓ వ్యక్తి ఇంటి నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోపు ఉన్న పబ్‌కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. పబ్‌లో ఫ్రెండ్‌తో డ్రింక్ తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే లేచేసరికి తన మొబైల్‌కు వచ్చిన మెసేజ్ చూసి షాక్ అయ్యాడు.

Uber Charged RS 32 Lakh
Uber Charged RS 32 Lakh : లండన్ లో ఊబర్ 15 నిమిషాల ప్రయాణానికి రూ.32 లక్షలు చార్జ్ చేసింది. ఓ వ్యక్తి ఇంటి నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోపు ఉన్న పబ్‌కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. పబ్‌లో ఫ్రెండ్‌తో డ్రింక్ తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే లేచేసరికి తన మొబైల్‌కు వచ్చిన మెసేజ్ చూసి షాక్ అయ్యాడు. క్యాబ్ బిల్లును ఊబర్ ఏకంగా 39,317 డాలర్లు (రూ.32.4 లక్షలు)గా చూపడంతో దిగ్ర్భాంతికి గురయ్యాడు.
డ్రాప్ లొకేషన్‌కు కేవలం 15 నిమిషాల వ్యవధిలో చేరుకున్నా.. ఇంత బిల్లు ఎందుకు వచ్చిందనేది అతడికి అర్థం కాలేదు. ఊబర్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోలేని మాంచెస్టర్‌కు చెందిన 22 ఏళ్ల ఒలివర్ ఇలా ఎందుకు జరిగిందని కంపెనీ కస్టమర్ కేర్‌కు కాల్ చేశారు.
సాంకేతిక సమస్యలతో డ్రాప్ లొకేషన్ అదే పేరుతో ఆస్ట్రేలియాలో ఉన్న మరో లొకేషన్ చూపించిందని దాంతోనే చిన్న రైడ్‌కే అంత బిల్లు వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇక ఒలివర్ ఖాతాలో అంతడబ్బు లేకపోవడంతో ఆ భారీ బిల్లు అతడి ఖాతా నుంచి డిడక్ట్ కాలేదు. డబ్బు డిడక్ట్ కాకుండా కేవలం మెసేజ్ రావడంతో బతికిపోయానని ఒలివర్ ఊపిరి పీల్చుకున్నాడు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.